Mobile Popup Ad
Mobile Popup Ad

కాంగ్రెస్, బీజేపీ వాళ్ళకో నీతి.. బాల్క సుమన్‌కు ఒక నీతా?: కేటీఆర్

కలం, వెబ్ డెస్క్: సింగరేణిలో జరుగుతున్న వరుస కుంభకోణాలను తమ పార్టీ బయటపెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలులో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ (Balka Suman)ను గురువారం పరామర్శించి అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. రూ.15,000 కోట్ల సైట్ విజిట్ సర్టిఫికేట్ కుంభకోణం, సోలార్ టెండర్ల కుంభకోణం, నైనీ కోల్ బ్లాక్ కుంభకోణాలను తమ పార్టీ నాయకులు బయటపెట్టారని చెప్పారు. కుంభకోణాలను బయటకి రాకుండా చేసేందుకు తమ పార్టీ నేత బాల్క సుమన్ మీద ఇష్టమొచ్చిన సెక్షన్లు పెట్టి జైల్లో వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల ఆవేశాన్ని, ఆక్రోశాన్ని దృష్టిలో పెట్టుకొని బాల్క సుమన్ మాట్లాడాడని అన్నారు.

బాల్క సుమన్ పై ఎందుకంత కోపం?

బాల్క సుమన్ మీద ప్రభుత్వానికి ఎందుకంత కోపమని.. ఉద్యమంలో బాల్క సుమన్‌పై 220 కేసులు పెట్టారని కేటీఆర్ ఫైర్ అయ్యారు.. ఇప్పుడు ఆ రికార్డులు బద్దలు కొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు తగలబెట్టాలని మాట్లాడితే చర్యలు ఉండవా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలకు ఒక నీతి, బాల్క సుమన్‌కు ఒక నీతి ఉంటుందా? అని నిలదీశారు. తమకేమీ జైళ్లు, పోరాటాలు కొత్త కాదని.. సీఎం రేవంత్ (CM Revanth) అన్యాయాలపై నిలదీస్తూనే ఉంటామని అన్నారు. సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలపై రేవంత్ రెడ్డిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.

ప్రగతి భవన్‌ను బాంబులు పెట్టి పేల్చాలన్న రేవంత్ రెడ్డి మీద చర్యలు తీసుకోరా? అని కేటీఆర్ ప్రశ్నించారు. హైదరాబాద్ పాత నగరం మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తానన్న బండి సంజయ్ మీద చర్యలు తీసుకోరా? అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేయించిన మైనంపల్లి హన్మంత్ రావు, ఒక కంపెనీని తగలబెడ్తానన్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిలపై చర్యలు ఉండవా? అని ప్రశ్నించారు. సింగరేణి కార్మికుల పొట్టకొడుతూ.. కాంగ్రెస్ సర్కార్ కుంభకోణాలు చేస్తుందని ఆరోపించారు. వాటినుండి దృష్టి మరల్చడానికి రేవంత్ సర్కార్ ప్రయత్నం చేస్తోందన్నారు. సింగరేణి కార్మికుల తరఫున నిలదీస్తూనే ఉంటామని.. అక్రమాలను బయటపెడుతూనే ఉంటామన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>