కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వ్యాఖ్యలపై నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘మీరొస్తానంటె మేమొద్దంటామా? రండి దొర.. కానీ వచ్చే ముందు ఉత్తుత్తినే వస్తున్నారా? పొత్తుతో వస్తున్నారా? లేదా సింగల్‌గా వస్తున్నారా? అది చెప్పి రండి’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. పవన్ పొత్తులతోనే వస్తారంటూ ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు జనసేన నేతలు, పవన్ అభిమానులు నెట్టింట పోస్టులతో విరుచుకపడుతున్నారు. దీంతో మరోసారి పాలిటిక్స్ హీటెక్కాయి.
అసలు నువ్వు ఎవరు..?
ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై బండ్ల గణేశ్ తీవ్రంగా స్పందించారు. ‘ఒరేయ్.. నీకెందుకురా ప్రతి దాంట్లో వేలుపెట్టడం? అసలు నువ్వెవడివి? తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా? నీ ఊరు ఏది, నీ కథ ఏంటి? నీ బతుక్కి పని లేకపోతే చూసుకో, కానీ అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీలవ్వకు. ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో, తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయ్’ అని ఘాటుగా రిప్లై ఇచ్చారు.

