ఏపీ నకిలీ మద్యం కేసులో జోగి రమేశ్(Jogi Ramesh)ను ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan) ఆరోపించారు. అందుకోసం నకిలీ ఆధారాలను సృష్టించడం జరుగుతోందన్నారు. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇందులో ఇటీవల జోగి రమేశ్ పేరు వెలుగు చూసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన జనార్థన్.. తాను జోగి రమేశ్ ఆదేశాల మేరకే నకిలీ మద్యం తయారీ చేయడం స్టార్ట్ చేశానని అన్నారు. ఈ మేరకు జనార్ధన్ రెడ్డి ఓ వీడియోను విడుదల చేశాడు. ఈ వీడియో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. దానిపై స్పందించిన జోగి రమేశ్.. తనకు నకిలీ మద్యానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. జనార్ధన్‌తో తనకు పరిచయం కూడా లేదని, తాను జనార్ధన్‌తో చాట్ చేశానని చెప్తున్నవన్నీ అవాస్తవాలని తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు. తాజాగా దీనిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు.
‘‘నకిలీ మద్యం కేసులో ప్రజల దృష్టిని టీడీపీ నుంచి డైవర్ట్ చేయడం కోసమే జోగి రమేశ్‌పై ఆరోపణలు చేస్తున్నారు. జనార్దన్‌తో పరిచయం లేదని జోగి రమేష్ క్లియర్‌గా చెప్పారు. తన రెండు ఫోన్లు కూడా చూపించాడు. వీళ్లే ఫేక్ చాట్‌ను క్రియేట్ చేసి బురదజల్లారు. లేని ఎవిడెన్స్‌ను క్రియేట్ చేయడం దారుణం. ఇటీవల లిక్కర్ స్కాం కేసులో రూ.11 కోట్లు సీజ్ చేసినట్లు హడావిడి చేశారు’’ అని జగన్(YS Jagan) అన్నారు.
Read Also: ‘తెలుసు కదా’ పస్ట్ చాయిస్ ఎవరో తెలుసా..!

