కలం, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డి జైలులో ఉన్న మాజీ కార్మొరేషన్ చైర్మన్ మన్నె క్రిశాంక్ ను కేటీఆర్ సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బెంగళూరు నుంచి హ్యాకర్లను తీసుకువచ్చి బీఆర్ఎస్ నేతలతో పాటు మా సీసీ కెమెరాలు, ఫోన్లు హ్యాక్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ప్రజలకు అండగా నిలవాల్సిన పోలీసులు కూడా ముఖ్యమంత్రి ప్రైవేట్ ఆర్మీ లాగా పని చేస్తున్నారని కేటీఆర్ (KTR) విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే మన్నే క్రిశాంక్ ని అరెస్ట్ చేసి జైలుకి పంపారని, 35 కేసులు క్రిశాంక్ పై పెట్టి సీఎం రేవంత్ పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ, సోషల్ మీడియాపై పెట్టిన శ్రద్ధలో ఒక పైసా శాంతిభద్రతలపై దృష్టి పెడితే బాగుంటుందని సీఎం రేవంత్ కి కేటీఆర్ హితవు పలికారు. కాగా, కొన్ని రోజుల క్రితం బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు కూడా తమ సీసీ కెమెరాలతో పాటు ఫోన్లను కూడా హ్యాక్ చేస్తున్నారని ఆరోపించారు.
Read Also: సినీ తారలకే తమిళ తంబీలు పట్టాభిషేకం.. ఎంజీఆర్ నుంచి విజయ్ దాకా!
Follow Us On: Instagram

