తమిళిసైకి భారీ షాక్.. గవర్నర్ గిరీ వదిలినా దక్కని విజయం

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై (Tamilisai) సౌందరరాజన్‌కు రాజకీయాల్లో వరుసగా ప్రతికూల ఫలితాలు ఎదురవుతున్నాయి. క్రియాశీల రాజకీయాల్లో రాణించాలనే ఉద్దేశంతో తమిళనాడు ఎన్నికల బరిలో నిలిచింది. ఆమెకు ఓటర్ల నుంచి ఆశించిన మద్దతు లభించడం లేదు. ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలనే ఆమె ఆశలకు ప్రస్తుత ఓట్ల లెక్కింపు సరళి భారీ నిరాశను మిగిలిస్తోంది.

తమిళనాడు (Tamil Nadu) ఎన్నికల కౌంటింగ్‌లో భాగంగా వెలువడుతున్న ఫలితాలు బీజేపీ అభ్యర్థి తమిళిసైకి (Tamilisai) గట్టి షాక్ ఇస్తున్నాయి. మూడు రౌండ్లు ముగిసే సమయానికి ఆమె కేవలం 4303 ఓట్లు మాత్రమే సాధించి, ప్రత్యర్థి కంటే 7593 ఓట్ల భారీ వ్యత్యాసంతో వెనుకంజలో ఉన్నారు. ఒకప్పుడు కీలకమైన రాజ్యాంగ పదవిని నిర్వహించి, మళ్లీ ప్రజాక్షేత్రంలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఆమెకు ఈ ఫలితాలు పెద్ద ఎదురుదెబ్బగా మారాయి.

Read Also: ఓట్ల లెక్కింపు.. ఆర్జీకర్ మృతురాలి తల్లి ముందంజ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>