కలం, వెబ్ డెస్క్: సాధారణంగా రాజకీయాలు వేరు, సినిమాలు వేరు అని భావిస్తారు. కానీ తమిళనాడులో (Tamil Nadu Politics) మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ వెండితెరపై మెరిసే తారలకు, ప్రజల గుండెల్లో ఉండే నాయకులకు మధ్య ఉన్న వ్యత్యాసం చాలా తక్కువ. సినిమాలు, రాజకీయాలు రెండూ ఒకటేనన్న అభిప్రాయం అక్కడి ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో టీవీకే (తమిళగ వెట్రి కళగం) పార్టీ దూసుకుపోతుండటంతో తమిళ తంబీలు మరోసారి తమ సినీ అభిమానాన్ని రాజకీయ శక్తిగా మలుస్తున్నారనే విషయం స్పష్టమవుతోంది.
1960వ దశకం చివరి నుంచీ తమిళనాడులో సినీ తారలదే ఆధిపత్యం. పార్టీలైనా, ప్రభుత్వమైనా వారిదే పైచేయి. కొద్దిమంది సినీ ప్రముఖులు పార్టీలు పెట్టి చేతులు కాల్చుకున్నారు. సక్సెస్ అయినవారు కొందరు.. ఫెయిల్ అయినవారు మరికొందరు. సినీ మాటల రచయితగా ‘పరాశక్తి’ మూవీతో కరుణానిధి పాపులర్. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. సక్సెస్ అయ్యారు. దాదాపై ఆరు దశాబ్దాలు యాక్టివ్ పొలిటీషియన్‌గా కొనసాగారు. సినీ నటుడిగా ఎంజీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. మూడుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత జయలలిత, శివాజీ గణేశన్, విజయ్‌కాంత్, శరత్‌కుమార్, కమల్‌హాసన్, టీ.రాజేందర్, సీమాన్.. ఇలా పదుల సంఖ్యలో ఉన్నారు. కొందరు హిట్ అయితే మరికొందరు ఫ్లాప్ అయ్యారు. ఎంజీఆర్ తరహాలోనే ఇప్పుడు విజయ్ బ్లాక్ బస్టర్ అయ్యారు.
ప్రస్తుతం ఆ వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ దళపతి విజయ్ టీవీకే (TVK) పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేయడం చర్చనీయాంశమైంది. ఎంజీఆర్ నుంచి నేటి విజయ్ దాకా సినీ నటుల ప్రభావం తమిళ రాజకీయాల్లో (Tamil Nadu Politics) చెక్కుచెదరకుండా కొనసాగుతోంది. కేవలం నటనను మాత్రమే కాకుండా, తెరపై వారు పోషించే పాత్రల్లోని సామాజిక స్పృహను చూసి ప్రజలు తమ భవిష్యత్తును వారి చేతుల్లో పెడుతున్నారు. ఈ పరిణామాలు తమిళనాడులో సినిమా, రాజకీయం విడదీయలేని బంధమని మరోసారి రుజువు చేస్తున్నాయి.
విజయ్‌కు కలిసొచ్చిన ఎమోషనల్ టచ్ :
విజయ్ రాజకీయాల్లోకి రాకముందు నుంచే సోషల్ రెస్పాన్సిబిలిటీ వైఖరిని మొదలుపెట్టారు. ఎక్కువగా విద్య, వైద్యంపై ఫోకస్ పెట్టారు. పేద పిల్లలు చదువుకోడానికి ఆర్థికంగా సాయం చేశారు. అనారోగ్యంతో ఉన్నవారికి సైతం సాయం చేశారు. రెండు ద్రవిడ పార్టీలకు సమదూరాన్ని పాటించారు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోనని ముందుగానే ప్రకటించారు. ఇప్పుడున్న పార్టీలన్నింటికి ఆల్టర్నేట్‌గా ఉంటానని ప్రజల్లో భరోసా కల్పించారు. కరూర్ ఘటన తర్వాత డీఎంకే పనిగట్టుకుని టార్గెట్ చేసిందనే అభిప్రాయం విజయ్ పట్ల సానుభూతిని పెంచింది. మార్పు కావాలి.. విజయ్ రావాలి.. అనే పర్‌సెప్షన్ ప్రజల్లో ఎస్టాబ్లిష్ అయింది. విజయ్ గెలిచిన 110 స్థానాల్లో వంద గతంలో డీఎంకే గెలిచిన సీట్లే. అన్నాడీఎంకే నుంచి కేవలం పది సీట్లే వచ్చాయి. ఆ రకంగా డీఎంకేను బాగా డ్యామేజ్ చేయడంలో విజయ్ సక్సెస్ సాధించారు.
Read Also: తమిళనాడులో హంగ్ వస్తే.. కింగ్ మేకర్‌గా విజయ్?
Follow Us On: Pinterest

