కలం, వెబ్‌డెస్క్: ఉత్తరాఖండ్ (Uttarakhand)లోని పౌరీ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పౌరీ-దేవప్రయాగ్ రోడ్డుపై వెళ్తున్న ఓ బొలెరో వాహనం అదుపుతప్పి లోయలో పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఓ మహిళ, మూడేళ్ల చిన్నారి కూడా ఉంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు, స్థానికులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతులు హరిద్వార్ జిల్లా లక్సర్‌కు చెందిన ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. ప్రమాదానికి అసలు కారణం ఇంకా తెలియరాలేదని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

