బండి సంజయ్‌ కేంద్రమంత్రి పదవిలో కొనసాగడం అవమానకరం : కేటీఆర్

కలం, వెబ్ డెస్క్ : కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కొడుకు భగీరథ్ పోక్సో కేసు ఇష్యూపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పందించారు. హైదరాబాద్ లో ‘నా బూత్ – నా భవిష్యత్తు’ పేరిట ఏర్పాటు చేసి శిక్షణా తరగతుల్లో ఆయన ప్రసంగించారు. మైనర్ పై లైంగికదాడికి పాల్పడ్డ వ్యక్తిని దాచిపెట్టారని విమర్శించారు. బాధితురాలి తల్లిదండ్రులను భయబ్రాంతులకు గురిచేసిన వ్యక్తి కేంద్రమంత్రిగా కొనసాగడం తెలంగాణతో పాటు భారత దేశానికే అవమానకరం అని కేటీఆర్ విమర్శించారు.

ప్రధానమంత్రి ‘భేటీ బచావో.. భేటీ పడావో’ కేవలం నినాదానికి మాత్రమే పరిమితమయిందని ఆయన (KTR) ఆరోపించారు. పోక్సో కేసులో కేంద్రమంత్రి కుమారుడి మీద లుక్ అవుట్ నోటీసులు జారీ చేసే పరిస్థితి వచ్చిందన్నారు. కేంద్రమంత్రి పదవి నుంచి బండి సంజయ్ ని భర్తరఫ్ చేయకపోతే విచారణ సజావుగా జరిగే పరిస్థితి లేదన్నారు. మైనర్ బాలికకు అన్యాయం జరిగితే రాష్ట్ర ప్రభుత్వం సైలెంట్ గా ఉందని కేటీఆర్ విమర్శించారు. కానీ, బాధితురాలికి న్యాయం జరగడం కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాడింది అని చెప్పుకొచ్చారు.

Read Also: బండి భగీరథ్ ఇష్యూ.. తెలంగాణలో బీజేపీ డ్యామేజ్ కంట్రోల్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>