SIR.. మైక్రో లెవల్‌లో ప్రణాళికతో ముందుకు వెళ్లాలి: సజ్జల

కలం, వెబ్ డెస్క్: ఎన్నికల జాబితాల సవరణ ప్రక్రియలో ప్రతి ఓటు విలువైనదని.. ఎక్కడా నిర్లక్ష్యం చోటు చేసుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని పార్టీ స్టేట్‌ కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (SIR) ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ తరుణంలో పార్టీ యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. బూత్‌ను ఒక యూనిట్‌గా తీసుకుని మైక్రో లెవల్‌లో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. ప్రతి బూత్‌లో సమర్థవంతమైన బూత్ లెవల్ ఏజెంట్ల (BLAs) నియామకం అత్యంత కీలకమని చెప్పారు. వీలైనంత త్వరగా బీఎల్‌ఏల నియామక ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. వీరికి అవసరమైన ఓరియెంటేషన్‌, శిక్షణ కార్యక్రమాల కోసం పార్టీ కేంద్ర కార్యాలయం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసిందని వివరించారు.

వచ్చే రెండు వారాల్లో పార్టీ కమిటీల నియామకం, ఐడీ కార్డుల వెరిఫికేషన్‌, డిజిటలైజేషన్‌ ప్రక్రియలను తప్పనిసరిగా పూర్తి చేయాలని ఆదేశించారు. పార్టీ చీఫ్ వైయస్‌ జగన్‌ (YS Jagan) స్వయంగా ఈ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని స్పష్టం చేశారు. వెరిఫికేషన్‌ ప్రక్రియలో వెనుకబడి ఉన్న జోన్లపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. వైసీపీ చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల్లోకి మరింత విస్తృతంగా వెళ్లేలా జిల్లా, నియోజకవర్గ స్థాయిలో మీడియా క్యాంపెయిన్‌, సోషల్ మీడియా ప్రచారాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు.

Read Also: డైనోసార్ల ప్రపంచంలోకి నారా దేవాన్ష్: నారా లోకేశ్‌ ఆసక్తికర పోస్ట్‌!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>