బండి భగీరథ్ ఇష్యూ.. తెలంగాణలో బీజేపీ డ్యామేజ్ కంట్రోల్

కలం, తెలంగాణ బ్యూరో : పోక్సో కేసులో బండి భగీరథ్‌ (Bandi Bhagirath Case) పై వచ్చిన ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రంలో, కేంద్రంలో రాజకీయంగా హాట టాపిక్‌గా మారింది. ఆ ఇష్యూ బండి సంజయ్‌కు సంబంధించిన కుటుంబ, వ్యక్తిగత వ్యవహారమే అయినా పొలిటికల్‌గా బీజేపీపై ఎలాంటి ప్రభావం పడుతుందన్న చర్చ మొదలైంది. ఈ డ్యామేజ్‌ను ఎలా కంట్రోల్ చేయాలన్నది కీలకంగా మారింది. తెలంగాణలో పార్టీని విస్తరించాలని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పవర్‌లోకి రావాలని బీజేపీ కేంద్ర నాయకత్వం బలంగా కోరుకుంటున్న సమయంలో ఈ అంశం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నది. పార్టీపైన ఈ అంశం ఎలాంటి ప్రభావం చూపుతుంది.. దాన్ని ఎలా ఎదుర్కోవాలి.. పార్టీ రూపొందించే కౌంటర్ స్ట్రాటెజీపై ఆసక్తి నెలకొన్నది. ఈ అంశాన్ని రాజకీయ ప్రత్యర్థులు పొలిటికల్‌గా మల్చుకునే ఎత్తుగడలను ఏ వ్యూహంతో ఎదుర్కోవాలనేది కీలకంగా మారింది.

క్లీన్ ఇమేజ్ ప్రొటెక్షన్‌లో బండి సంజయ్ :

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ పోక్సో కేసు (Bandi Bhagirath Case), జ్యుడిషియల్ రిమాండ్ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది. కోర్టులో ట్రయల్ ప్రారంభం కాకపోయినా, నేరం రుజువు కాకపోయినా పొలిటికల్ డిబేట్ మొదలైంది. ఇంతకాలం క్లీన్ ఇమేజ్‌ ఆయనకు కలిసొచ్చిన అంశం. “ఇప్పుడు హోం మంత్రి కొడుకే పోక్సో కేసులో ఇరుక్కున్నాడు.. చర్లపల్లి జైలుకు వెళ్ళాడు..” అనే పబ్లిక్ పర్సెప్షన్ ఆయన పొలిటికల్ కెరీర్‌పై ప్రభావం చూపుతున్నది. ఈ పరిణామం బండి సంజయ్ వ్యక్తిగత రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపడానికి ముందే నష్ట నివారణ చర్యలు మొదలయ్యాయి. “చట్టం ముందు అందరూ సమానం.. చట్టం మీద గౌరవంతో లాయర్ల ద్వారా పోలీసులకు అప్పగించాను…” అనే మెసేజ్‌ ఇవ్వడం ప్రజల్లో తన ఇమేజ్‌ను కాపాడుకునే రాజకీయంగా నష్ట నివారణ ప్రయత్నం.

నైతికంగా ఇబ్బందుల్లో బండి సంజయ్ :

కార్పొరేటర్ స్థాయి నుంచి కేంద్ర మంత్రివరకు ఎదిగిన బండి సంజయ్‌ (Bandi Sanjay) తన దూకుడు స్వభావం, హిందుత్వ ఎజెండాతో గుర్తింపు పొందారు. శాంతిభద్రతలు, మహిళల భద్రత, బాలల హక్కులు.. ఇవన్నీ కేంద్ర హోం సహాయ మంత్రిగా ఆయన పరిధిలోని అంశాలు. బాలల లైంగిక వేధింపుల నిరోధక చట్టమైన పోక్సో కేసులో కొడుకు ఇరుక్కోవడం బండి సంజయ్‌కు నైతికంగా ఇబ్బందికర పరిణామం. ఇప్పటికే ప్రతిపక్షాలు మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. మంత్రివర్గం నుంచి తొలగించాలంటూ ప్రధానిపై ఒత్తిడి పెరుగుతున్నది. నిష్పక్షపాత దర్యాప్తు కోసం పదవి నుంచి తప్పుకోవాలని వాదిస్తున్నాయి. త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే పరిస్థితుల్లో బండి సంజయ్ మంత్రి పదవిపై ఊహాగానాలు మొదలయ్యాయి.

ప్రతిపక్షాలకు రాజకీయ అస్త్రం :

కుటుంబ విలువలు, సంప్రదాయాలు, సనాతన ధర్మం, నైతికత.. ఇలాంటి అంశాలను తరచూ ప్రస్తావించే బీజేపీ ఇప్పుడు బండి భగీరథ్ పోక్సో కేసుకు కౌంటర్ ఇవ్వడం అనివార్యమైంది. బండి సంజయ్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత వ్యవహారమే అయినా పార్టీపై పడే ప్రభావం కూడా కీలకంగా మారింది. సరిగ్గా ప్రతిపక్షాలు బీజేపీ నైతికతను ఈ కోణం నుంచి ప్రశ్నిస్తున్నాయి. ఈ కేసును ఆయుధంగా వాడుకుంటున్నాయి. విపక్షాలకు తనదైన శైలిలో పొలిటికల్‌గా కౌంటర్లు ఇచ్చి ప్రజాదరణను పొందే బండి సంజయ్ తాజా కేసుతో గతంలోని దూకుడును, తీవ్రతను ప్రదర్శించగలుగుతారా అనేది గమనార్హం. ఇప్పటివరకూ పొలిటికల్ విమర్శలు ఎదుర్కొన్న బండి సంజయ్ ఇప్పుడు నైతికత కోణం నుంచి ఫేస్ చేయనున్నారు. సీఎం రేవంత్ సైతం ఇటీవలే ‘నైతికంగా తప్పు’ అని కామెంట్ చేశారు.

పార్టీ కేంద్ర నాయకత్వంపైనే ఫోకస్ :

పోక్సో కేసు బండి సంజయ్‌ కుటుంబానికి చెందిన వ్యవహారం కావడంతో పార్టీపై మచ్చ పడకుండా నివారణ, దిద్దుబాటు చర్యలు మొదలయ్యాయి. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, ప్రధాని మోదీ (PM Modi), కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ఎలాంటి వైఖరి తీసుకుంటారనేది కీలకం. అవినీతి, క్రైమ్ విషయంలో కఠినంగా ఉండే ప్రధాని తాజా పోక్సో కేసును రాజకీయ కుట్రగా కామెంట్ చేస్తారా?.. లేక పిల్లలు చేసిన తప్పిదంగా భావిస్తారా?.. ఆ వ్యవహారం తెలంగాణలో పార్టీకి ఎలాంటి చేటు తెచ్చే అవకాశమున్నది?.. ఇప్పుడే రియాక్ట్ కావడమా?.. లేక బెయిల్ వచ్చే వరకు వెయిట్ చేయడమా?.. ఇలాంటి అనేక ప్రశ్నలు స్టేట్ పార్టీ యూనిట్‌లో వినిపిస్తున్నాయి. ‘హనీ ట్రాప్’ అంటూ ఇప్పటికే ఒక ఎఫ్ఐఆర్ నమోదైనందున రానున్న రోజుల్లో ఈ ఇష్యూను బీజేపీ స్టేట్, సెంట్రల్ లీడర్‌షిప్ ఎలా రియాక్ట్ అవుతుందన్నది ఆసక్తికరం.

కుటుంబ వివాదాలూ పొలిటికల్‌ చిక్కులుగా :

రాజకీయ నాయకులకు వారు చేసే ప్రసంగాలు, ప్రజా మద్దతు, పార్టీ పదవులతో పాటు కొన్ని సందర్భాల్లో కుటుంబ వివాదాలూ వారి పొలిటికల్ ఫ్యూచర్‌పై ప్రభావం చూపిస్తాయి. తెలంగాణ బీజేపీకి ఫేస్‌వ్యాల్యూగా మారిన బండి సంజయ్ ఇప్పుడు కుమారుడి ఇష్యూతో డిఫెన్సులో పడ్డారు. బండి భగీరథ్ కేసు లీగల్‌ వ్యాలిడిటీ ఎలా ఉన్నా రాజకీయ ప్రభావం మరోలా ఉంటుంది. చివరకు ఇది వ్యక్తిగత కుటుంబ సమస్యగా ముగుస్తుందా?.. లేక రాజకీయ అంశంగా మారుతుందా?.. సొంత పార్టీలోనే కాక ప్రత్యర్థి పార్టీల్లోనూ చర్చనీయాంశమైంది. తెలంగాణలో బీజేపీ బలహీనంగా ఉన్న టైమ్‌లో రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రజా సంగ్రామయాత్ర లాంటి కార్యక్రమాలు చేపట్టి పార్టీ క్యాడర్‌ను యాక్టివ్ చేసిన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నిర్మించుకున్న పొలిటికల్ ఇమేజ్‌ ఇప్పుడు కుమారుడి పోక్సో (Bandi Bhagirath Case) వ్యవహారంతో వివాదంలో చిక్కుకున్నది.

Read Also: బండి సంజయ్‌ కేంద్రమంత్రి పదవిలో కొనసాగడం అవమానకరం : కేటీఆర్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>