epaper
Sunday, February 1, 2026
spot_img
epaper

రేవంత్​ రెడ్డిది పైశాచిక ఆనందం : కేటీఆర్

కలం, వెబ్​ డెస్క్​ : ఫోన్​ ట్యాపింగ్​ కేసులో విచారించేందుకు మాజీ సీఎం, బీఆర్​ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చిన తీరును బీఆర్​ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సాధకుడు, ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఈ దుర్మార్గపు వైఖరి ఏంటి అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. స్వయంగా కేసీఆర్‌‌యే తానుంటున్న నివాసంలో అడ్రస్​ తో సహా పోలీసులకు రిప్లై ఇచ్చాక కూడా ఆయన లేని నివాసానికి రాత్రిపూట వచ్చి గేటుకు నోటీసులు అంటించి పొందడం దారుణం అని మండిపడ్డారు. ఇది అహంకారం కాకపోతే మరేమిటి? అని కేటీఆర్​ నిలదీశారు.

65 ఏళ్లు దాటిన వ్యక్తులను వారుంటున్న నివాసం వద్దనే విచారించాలన్న రూల్ కూడా పోలీసులు అతిక్రమిస్తున్నారన్నారు. అసలు పోలీసులకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మీద అవగాహన ఉందా? లేక మీ చేతిలో కీలుబొమ్మల్లా.. ప్రతిపక్ష నాయకులను వేధించడమే పనా? అని సీఎం రేవంత్​ రెడ్డిని కేటీఆర్​ ప్రశ్నించారు. ‘చట్టం, న్యాయం, ధర్మం మీద మీకు గౌరవం లేకపోవచ్చు.. కానీ మాకు వాటి మీద పూర్తిగా విశ్వాసం ఉంది. ఈ అక్రమ కేసులన్నీ ఛేదిస్తాం. మీ ప్రతి తప్పుడు పనిని వెలికితీసి తెలంగాణ ప్రజల ముందు పెడతాం. మీరెన్ని వేధింపులకు పాల్పడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా ప్రజాక్షేత్రంలోనే వారు బుద్ధి చెబుతారు’ అని కేటీఆర్​ (KTR) ఎక్స్​ వేదికగా స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>