epaper
Sunday, February 1, 2026
spot_img
epaper

ఫిబ్రవరి 1 నుంచి ఆధార్, ఫాస్టాగ్ లో కీలక మార్పులు..

కలం, డెస్క్ : ఫిబ్రవరి నెల మొదలైంది. ఈ నెల 1వ తేదీ నుంచి ఆధార్, ఫాస్టాగ్, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లలో కీలక మార్పులు (February 1 Rules) జరగబోతున్నాయి. ఇప్పటి వరకు ఉన్న కొన్ని ఇబ్బందులు తగ్గబోతున్నాయి. అలాగే భద్రత మరింత పెంచే విధంగా ఈ మార్పులు తీసుకొచ్చింది ప్రభుత్వం. ఇంతకీ ఏయే మార్పులు వచ్చాయో ఒకసారి చూద్దాం.

ఫాస్టాగ్ విషయంలో..

ఫిబ్రవరి 1 నుంచి (February 1 Rules) వెహికల్ ఓనర్లు పదే పదే కేవైసీ అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు. ఫాస్టాగ్ లను జారీ చేసేముందు కస్టమర్ల పూర్తి వివరాలను బ్యాంకులు వెరిఫై చేయాలని కేంద్రం ఇప్పటికే ఆదేశించింది. ఇక నుంచి నో యువర్ వెహికల్ ప్రాసెస్ ను రద్దు చేయాలని నేషనల్ హైవే అథారిటీ నిర్ణయం తీసుకుంది. కాబట్టి టోల్ గేట్ల వద్ద వినియోగదారులు ఎదుర్కుంటున్న సమస్యలు తగ్గే ఛాన్స్ ఉంది. ఎవరికైనా ట్యాగ్ మిస్ యూజ్ అయినా లేదంటే ఫాస్టాగ్ డీటేయిల్స్ లో సమస్య ఉంటే రీ వెరిఫికేషన్ కు వెళ్లొచ్చు.

ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి..

ఫిబ్రవరి 1 నుంచి ఏదైనా ప్రాపర్టీ లేదా భూముల రిజిస్ట్రేషన్ చేసే ముందు ఆధార్ వెరిఫికేషన్ కచ్చితంగా చేయనున్నారు. రిజిస్ట్రేషన్ చేసే ముందే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఉండే బయోమెట్రిక్ మెషిన్ల ఆధారంగా ఆధార్ వెరిఫకేషన్ నిర్వహిస్తారు. అక్రమ రిజిస్ట్రేషన్లను తగ్గించేందుకు ఈ వెరిఫికేషన్ తీసుకొచ్చారు.

వారి కోసం ఫేస్, ఓటీపీ వెరిఫికేషన్..

ప్రభుత్వ పథకాలు లేదా ఇతర అప్లికేషన్ల సమయంలో వేలిముద్రలు మ్యాచ్ అవ్వక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా వృద్ధుల వేలిముద్రలు రాక కొన్ని సార్లు సంక్షేమ పథకాలు కూడా అందవు. ఇలాంటి వారి కోసం ఫిబ్రవరి 1 నుంచి ఫేస్, ఓటీపీ వెరిఫికేషన్ ఆప్షన్ తీసుకొచ్చారు. ఆధార్ లింక్ ఉన్న మొబైల్ నెంబర్ల ద్వారా ఓటీపీ వెరిఫికేషన్ చేయబోతున్నారు. లబ్దిదారుల ఫేస్ వెరిఫికేషన్ కూడా చేస్తారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>