రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటన.. కేటీఆర్​ ప్రశ్నల వర్షం!

కలం, వెబ్​ డెస్క్​: కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ (Rahul Gandhi) హైదరాబాద్​ పర్యటనపై బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ స్పందించారు. తెలంగాణలో కాంగ్రెస్​ అరాచకాలకు పాల్పడినప్పుడు రాహుల్​ గాంధీ ఎక్కడున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఉద్యోగాల కోసం పోరాడుతున్న నిరుద్యోగ విద్యార్థులను పోలీసులతో గొంతునులిమి, దాడి చేసినప్పుడు రాహుల్​ ఎందుకు రాలేదని ప్రశ్నించారు.

లగచర్ల(Lagacherla)లో వారి భూముల కోసం పోరాడుతున్న మహిళలను కొట్టి, దుస్తులు చింపి అవమానించినప్పుడు చలనం కలగలేదా అని కేటీఆర్​ నిలదీశారు. హైడ్రా (Hydraa) బుల్డోజర్లతో ప్రజల ఇళ్లను కూల్చివేస్తున్నప్పుడు ఢిల్లీలో నిద్రపోతున్నారా? అని ప్రశ్నించారు. కంచె గచ్చిబౌలి భూముల విధ్వంసం, కేబీఆర్ పార్కును నాశనం చేస్తున్నప్పుడు రాహుల్​ గాంధీ ఎందుకు మాట్లాడలేదన్నారు. రాజ్యాంగ ప్రక్రియను అపహాస్యం చేస్తూ.. బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి కాంగ్రెస్​ లో చేర్చుకున్నప్పుడు మౌనంగా ఎందుకు ఉన్నారని నిలదీశారు. అసెంబ్లీ ఎదుటే మహిళా ప్రజాప్రతినిధులు చీరలు లాగి, దాడులు చేసినప్పుడు రాహుల్​ గాంధీ ఒక్క మాటైనా మాట్లాడలేదని కేటీఆర్ (KTR)​ గుర్తు చేశారు.

రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, జర్నలిస్టుల అరెస్టులు, భూకబ్జాలపై మాట్లాడడానికి సమయం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్​ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు బహిరంగంగా అవినీతి గురించి మాట్లాడినా నోరు మెదపలేదని రాహుల్​ పై ధ్వజమెత్తారు. అవసరమైనప్పుడు మౌనంగా ఉండి.. ఇప్పుడు ప్రచార ఆర్భాటం కోసం వచ్చారా? అని ఫైర్​ అయ్యారు. తెలంగాణ ప్రజల సొమ్ముతో ఈ ప్రచార పర్యటనలు చేయడానికి రాహుల్​ గాంధీకి అధికారం ఎవరు ఇచ్చారు అని సూటిగా ప్రశ్నించారు.

Also Read : సజ్జనార్ యూనిఫాంలో ఉన్న నేరస్థుడు: మాజీ ఐపీఎస్ సంచలన వ్యాఖ్యలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>