ట్రంప్ నుంచి ప్రపంచాన్ని కాపాడాలి: కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ (KA Paul) విమర్శలు గుప్పించారు. ట్రంప్ బారి నుంచి ప్రపంచాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆయనను ప్రశ్నించే ధైర్యం తనకు తప్ప మరెవరికీ లేదని పాల్ పేర్కొన్నారు. గతంలో వేల మందితో సంబంధాలు పెట్టుకున్నట్లు ట్రంప్ స్వయంగా చెప్పుకున్నారని, అంతేకాకుండా ఇవాంక తన కుమార్తె కాకపోయి ఉంటే ఆమెతోనూ డేటింగ్ చేసేవాడినని వ్యాఖ్యానించిన విషయాన్ని కేఏ పాల్ గుర్తు చేశారు.

ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ అయిన ఎన్విడియా (NVIDIA) వ్యవస్థాపకుడు జెన్సన్ హువాంగ్ తైవాన్ నుంచి అమెరికాకు వచ్చి లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ నీతిగా వ్యాపారం చేసి నంబర్ వన్ స్థాయికి ఎదిగారని పాల్ ప్రశంసించారు. ఎలాన్ మస్క్ మాదిరిగా జెన్సన్ హువాంగ్ (Jensen Huang) ఎన్నడూ ట్రంప్ కు లొంగిపోలేదని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు మార్కో రూబియో, భారత్ లోని అమెరికన్ రాయబారి ద్వారా అదానీ, అంబానీల వ్యాపార ఒప్పందాల గురించి ట్రంప్ తెలుసుకున్నారని, ఇందులో జరిగిన అవినీతిని మాటల్లో వర్ణించలేమని ఆరోపించారు.

దేశాన్ని రాజకీయ నాయకులే సర్వనాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన కేఏ పాల్ (KA Paul), అవినీతిపరులను ఎత్తిచూపడం తన బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలోని నాలుగు స్తంభాలలో మీడియా అత్యంత కీలకమైనదని పేర్కొంటూ, ఒకవేళ వ్యాపారవేత్తలు తప్పు చేస్తే మీడియా యాజమాన్యాలు, ప్రతినిధులు వారిపై చర్యలు తీసుకుంటారా అని ఆయన ప్రశ్నించారు.

Also Read : సజ్జనార్ యూనిఫాంలో ఉన్న నేరస్థుడు: మాజీ ఐపీఎస్ సంచలన వ్యాఖ్యలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>