సజ్జనార్ యూనిఫాంలో ఉన్న నేరస్థుడు: మాజీ ఐపీఎస్ సంచలన వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్ : సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్‌పై మాజీ ఐపీఎస్ అధికారి ఎం. నాగేశ్వరరావు (Former IPS Nageswara Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ బాధ్యతల నుంచి సజ్జనార్‌ను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ బదిలీకి గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, డీజీపీ సీవీ ఆనంద్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

సజ్జనార్‌ను యూనిఫాంలో ఉన్న నేరస్థుడిగా అభివర్ణిస్తూ నాగేశ్వరరావు  విమర్శలు గుప్పించారు. గతంలో తనతో కలిసి పనిచేసిన ఒక సహోద్యోగిని ఇలా నేరస్థుడిగా విమర్శించడం తనకు ఎంతో బాధ కలిగిస్తోందని, అయినప్పటికీ నిజాన్ని నిర్భయంగా చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సర్వీస్ స్నేహబంధం కంటే ప్రజా ప్రయోజనాలే తనకు ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.

కేవలం బదిలీ చేయడం వల్ల అది శిక్ష కాబోదని, గతంలో చేసిన నేరాలు కూడా చెరిగిపోవని నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. సజ్జనార్ చేసిన నేరపూరిత కార్యకలాపాలన్నింటిపైనా సమగ్ర విచారణ జరిపించాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటే ఆయనను చట్టం ముందు నిలబెట్టి శిక్షించడమే ఏకైక మార్గమని తన ట్వీట్‌లో డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>