బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి మరో తుపాన్ ముప్పు!

కలం, వెబ్ డెస్క్ : ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, అది వాయువ్య దిశగా కదులుతూ రాగల 48 గంటల్లో వాయుగుండంగా మారుతుందని భారత వాతావరణ శాఖ (IMD) ప్రకటించింది. వాయుగుండంగా మారిన తర్వాత దిశ మార్చుకుని తుపానుగా (Cyclone Alert AP) బలపడేందుకు అవకాశం ఉందని వెల్లడించింది. తుపానుగా మారితే కోస్తాంధ్రపై ప్రభావం చూపే అవకాశం ఉందని, ఇప్పటికే వరుస తుపాన్‌ల ప్రభావాన్ని ఎదుర్కొంటున్న ఏపీకి ఈ పరిణామం మరింత ఆందోళన కలిగిస్తోందని తెలిపింది.

సముద్రంలో తుపాన్‌గా ఏర్పడి తీరానికి దగ్గరగా వచ్చేసరికి బలహీన పడవచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. తుపాను, తీవ్ర వాయు గుండంగానే తీరాన్ని దాటినా భారీ వర్షాల ముప్పు కలిగే అవకాశముందని పేర్కొంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, అల్పపీడనం క్రమంగా బలపడితే గాలుల తీవ్రత, వర్షపాతం పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకోవచ్చని ఐఎండీ వెల్లడించింది.

Also Read : సజ్జనార్ యూనిఫాంలో ఉన్న నేరస్థుడు: మాజీ ఐపీఎస్ సంచలన వ్యాఖ్యలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>