“ఇక అంతమే”.. ఇరాన్‌కు ట్రంప్​ మళ్లీ వార్నింగ్​!

కలం, వెబ్ డెస్క్​: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇరాన్‌కు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ను ఇరాన్ టార్గెట్ చేసిందన్న వార్తలపై ఆయన స్పందించారు. ఇరాన్ నుంచి తన ప్రాణానికి ముప్పు ఉందని ఆరోపణలు రావడంతో, బెసెంట్ ఈ వారం ప్రారంభంలో తన నివాసం నుంచి అమెరికా సైనిక స్థావరానికి మారినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ట్రంప్ మాట్లాడారు.

అమెరికా అధికారులపై జరిగే దాడులకు బాధ్యులైన వారు ఇక ఉండరని ట్రంప్​ హెచ్చరించారు. అవసరమైతే సైనిక చర్యకు దిగడానికి వెనుకాడబోనని స్పష్టం చేశారు. తన అధ్యక్ష పదవీకాలం తర్వాత కూడా ఇరాన్ ప్రస్తుత నాయకత్వం కొనసాగడాన్ని వైఫల్యంగా ట్రంప్ అభివర్ణించారు. ఇరాన్ నాయకత్వం పట్టు కోల్పోతోందని, ఆ దేశ ప్రభుత్వం కూలిపోతోందని ఆయన (Donald Trump) జోస్యం చెప్పారు.

ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన నౌకా రవాణా మార్గమైన హోర్ముజ్ జలసంధిపై అమెరికాకు పూర్తి నియంత్రణ ఉందని తెలిపారు. గల్ఫ్ ప్రాంతంలోనూ అమెరికా ఆధిపత్యం కొనసాగుతోందన్నారు. యుద్ధం జరగడానికి ముందుకంటే ప్రస్తుతం తాము మరింత ఎక్కువగా చమురును వెలికితీస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. హోర్ముజ్ జలసంధి తమ నియంత్రణలోనే ఉందని ఆయన ప్రకటించారు.

మరోవైపు, ఇరాన్‌తో ఘర్షణల ముగింపు ఎలా ఉంటుందనే దానిపై అమెరికా తదుపరి సైనిక చర్యలు ఆధారపడి ఉంటాయని సంకేతాలిచ్చారు. పరిస్థితులు మారితే సైనిక ప్రతిస్పందనను మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉందని ట్రంప్ హెచ్చరించారు. ట్రంప్ తాజా వ్యాఖ్యలతో అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>