అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం.. సరదాగా ముచ్చటించుకున్న ఆ ముగ్గురు

కలం, వెబ్ డెస్క్: అసెంబ్లీ (Telangana Assembly) అనగానే నేతల మాటల యుద్ధం.. ఒకరిపై ఒకరు ఘాటు ఆరోపణలు చేసుకోవడం.. నిరసనలు వ్యక్తం చేయడం లాంటివి జరుగుతుంటాయి. కానీ ప్రధాన పార్టీలకు చెందిన నేతలు సరదాగా మాట్లాడుకోవడం, కలిసి భోజనం చేయడం లాంటివి చాలా అరుదు. మంగళవారం అసెంబ్లీ డైనింగ్ హాల్‌లో ఆసక్తికర సన్నివేశం జరిగింది. ఒకే టేబుల్‌పై కేటీఆర్ (బీఆర్ఎస్), రాజగోపాల్ రెడ్డి (కాంగ్రెస్), పాయల్ శంకర్ (బీజేపీ) కలిసి లంచ్ చేశారు. లంచ్ పూర్తయిన తర్వాత కూడా డైనింగ్ హాల్లో సమావేశం కంటిన్యూ చేశారు. దాదాపు రెండు గంటలపాటు కేటీఆర్ (KTR), రాజగోపాల్ రెడ్డి, పాయల్ శంకర్ సంభాషణ జరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇతరులను ఆకర్షించాయి.

గతంలో కూడా కేటీఆర్, రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీ లాబీల్లో ఎదురైనప్పుడు ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటూనే ‘బ్రదర్’ అని పలకరించుకున్న సందర్భాలున్నాయి. ప్రజాక్షేత్రంలో పార్టీల పరంగా ఎన్ని విమర్శలు ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా కలుస్తూ ముచ్చటించుకున్నారు. ఇలాంటి సన్నివేశాలు ప్రజాస్వామ్యంలో ఒక మంచి పరిణామమని రాజకీయ విమర్శకులు భావిస్తున్నారు.

Read Also: తెలంగాణ ఫస్ట్… సెన్సేషనల్ యాక్ట్స్

Follow Us On: X(Twitter)

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>