కలం, ఖమ్మం బ్యూరో : భద్రాచలం (Bhadrachalam) గోదావరి బ్రిడ్జి సారపాక వైపు ఉన్న మూడో నెంబర్ పిల్లర్ వద్ద ఒక గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. నదిలో మృతదేహాన్ని గమనించిన స్థానికులు అందించిన సమాచారంతో, భద్రాచలానికి చెందిన ప్రముఖ గజ ఈతగాడు ప్రసాద్ సహాయంతో మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకువచ్చారు.
మృతుని వయస్సు సుమారు 40 నుండి 45 సంవత్సరాల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. సంఘటనా స్థలంలో లభించిన వివరాల ప్రకారం, సదరు వ్యక్తి బూడిద రంగు ఫుల్ హ్యాండ్స్ షర్ట్, బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. కాగా సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అలాగే ఈ వ్యక్తికి సంబంధించిన వివరాలు గానీ, ఆచూకీ గానీ తెలిసిన వారు వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.

