పుష్ప-2 రికార్డు బ్రేక్.. బాహుబలిపై కన్నేసిన ధురంధర్

కలం, వెబ్ డెస్క్ : రణ్ వీర్ సింగ్ నటించిన మోస్ట్ వెయిటెడ్ మూవీ ధురంధర్ 2 (Dhurandhar-2) దుమ్ములేపుతోంది. బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. ఇప్పటికే వచ్చిన ఫస్ట్ పార్టు భారీ హిట్ కావడం.. అంచనాలు భారీగా పెరగడంతో.. రెండో పార్టుపై విపరీతమైన క్రేజ్ ఉండటం బాగా కలిసి వచ్చింది. ఇక సినిమా కూడా బాగుండటంతో కలెక్షన్లలో రికార్డులు సృష్టిస్తోంది. గత కొన్నేళ్లుగా పడిపోయిన బాలీవుడ్ కు ఈ సినిమా పెద్ద ఊతంలా నిలుస్తోంది. ఇండియన్ సినిమాల కలెక్షన్లను పరిశీలిస్తే.. టాప్-3లో ఉన్న పుష్ప ప్రాంచైజీ రికార్డులను ధురంధర్ ప్రాంచైజీ చెరిపేసింది.

పుష్ప రెండు పార్టులు కలిపి రూ.2 వేల కోట్ల కలెక్షన్లు వసూలు చేసింది. ధురంధర్ ప్రాంచైజీలో రెండు పార్టులు కలిపి ఇప్పటికే రూ.2100 కోట్ల కలెక్షన్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ధురంధర్-2 (Dhurandhar-2) రిలీజ్ అయిన ఐదు రోజులకే ఈ రికార్డు నెలకొల్పింది. దీంతో టాప్-2లో ఉన్న బాహుబలి ప్రాంచైజీ వసూళ్లు రూ.2400 కోట్ల రికార్డ్ కూడా బద్దలయ్యేలా కనిపిస్తోంది. ఇంకో నాలుగు రోజుల్లో బాహుబలి ప్రాంచైజీని దాటేసేలా ఉంది. ఆ తర్వాత టాప్-1లో ఉన్న దంగల్ కలెక్షన్లు రూ.3195 కోట్ల కలెక్షన్ల వైపు సాగినా ఆశ్చర్య పడాల్సిన పనిలేదంటున్నారు ట్రేడ్ నిపుణులు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>