కలం, తెలంగాణ బ్యూరో: కీలక నిర్ణయాలు.. సంచలన చట్టాలతో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ భిన్నం. అడ్మినిస్ట్రేషన్ కోణంలోనే కాక సోషల్ జస్టిస్ స్ఫూర్తిగానూ రాష్ట్ర సర్కార్ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నది. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించిన మొదటి, ఏకైక రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది. బీసీ కులగణన చేపట్టి అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వం సైతం తెలంగాణ తరహాలో కులగణనకు చొరవ తీసుకున్నది. తాజాగా ఉన్నత విద్యా సంస్థల్లో కులవివక్షకు వ్యతిరేకంగా రోహిత్ వేముల చట్టాన్ని (Rohith Vemula Act) తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ చర్చించి విధి విధానాలను ఖరారు చేయనున్నది. త్వరలో చట్టం రానున్నది. దేశం చూపు తెలంగాణ వైపు… అనే తరహాలో సంచలన నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నది.
పై మూడు నిర్ణయాలూ ‘సామాజిక న్యాయం’తో ముడిపడినవే. రెండున్నరేళ్ల కింద అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ మూడింటి గురించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. అందులో రెండింటికి చట్టబద్ధత లభించింది. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీ వర్గీకరణ డిమాండ్ ఎట్టకేలకు సాకారమైంది. జిత్‌నీ ఆబాదీ.. ఉత్‌నా హక్.. అనే స్లోగన్‌కు తగినట్లుగా బీసీ రిజర్వేషన్ చట్టం అమల్లోకి వచ్చింది. దేశవ్యాప్తంగానే సంచలనం సృష్టించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనపై స్పందించిన రాహుల్‌గాంధీ మూడుసార్లు నగరంలో నిరసనల్లో పాల్గొన్నారు. విద్యర్థులతో మాట్లాడారు. రోహిత్ వేముల చట్టం తెస్తామని హామీ ఇచ్చారు. కేబినెట్ పాజిటివ్ నిర్ణయం తీసుకున్నది. త్వరలో చట్టం రానున్నది. రాష్ట్ర ప్రభుత్వ సంచలన నిర్ణయాలపై కలం స్పెషల్ పేజ్ చదివేందుకు కింద ఉన్న పేపర్ ఇమేజ్ పై క్లిక్ చేయండి.

Read Also: అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం.. సరదాగా ముచ్చటించుకున్న ఆ ముగ్గురు
Follow Us On: Instagram

