Mobile Popup Ad
Mobile Popup Ad

డీలిమిటేషన్‌ను స్వాగతిస్తున్నాం.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్ : అసెంబ్లీ, పార్లమెంట్ సీట్ల పెంపుపై కేటీఆర్ (KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ సీట్ల పెంపును స్వాగతిస్తున్నామని తెలిపారు. డీలిమిటేషన్ ఎప్పుడో జరగాలని.. కానీ ఆలస్యం అయిందని చెప్పారు. 2014 ఏపీ పునర్విభజన చట్టంలోనే డీలిమిటేషన్ గురించి ఉందని.. కానీ ఇప్పటి దాకా జరగలేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు కేటీఆర్.

డీలిమిటేషన్ కు ఓట్ల వ్యత్యాసం అనేది ఉండొద్దన్నారు కేటీఆర్ (KTR). ‘పార్లమెంట్ లో దక్షిణాది రాష్ట్రాలకు 24 శాతం కోటా ఉంది. కేంద్రం దాన్ని కొనసాగించాలి. కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తుందని నేను అనుకోవట్లేదు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే మంచిదే. దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను బాగా పాటించాయి. కాబట్టి పాటించిన వారికి జరిమానా విధించి.. పాటించని వారికి నజరానా అంటే కుదరదు. అలాంటి తప్పును కేంద్ర ప్రభుత్వం చేయొద్దని కోరుతున్నా. అశ్వారావుపేటలో ఒక లక్షా 30వేల ఓట్లు ఉంటే.. శేరిలింగంపల్లిలో 9లక్షల ఓట్లు ఉన్నాయి. కాబట్టి నియోజకవర్గాల మధ్య ఈ ఓట్ల తేడా అనేది ఉండొద్దు. డీలిమిటేషన్ తో ఇవన్నీ పోతాయని భావిస్తున్నా’ అని కేటీఆర్ పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>