హరీశ్ రాణా కన్నుమూత.. 13 ఏళ్ల నరకయాతనకు ముగింపు

కలం, వెబ్ డెస్క్: సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పుతో కారుణ్య మరణానికి అనుమతి పొందిన హరీశ్ రాణా (Harish Rana) మంగళవారం కన్నుమూశారు. 2013లో చండీగఢ్‌లో భవనంపై నుంచి ప్రమాదవశాత్తు కింద పడటంతో మెదడుకు గాయమైంది. 13 ఏళ్లుగా కోమాలో ఉండిపోయాడు. తమ కుమారుడు పడుతున్న నరకయాతనను చూడలేక కారుణ్య మరణాన్ని ప్రసాదించాలని తల్లిదండ్రులు న్యాయ పోరాటం చేశారు. చివరకు సుప్రీంకోర్టు గుర్తించి, మార్చి 11న ఆయనకు కారుణ్య మరణానికి అనుమతినిచ్చింది.

కోర్టు ఆదేశాల మేరకు మార్చి 14న హరీశ్ రాణాను ఢిల్లీలోని ఎయిమ్స్ (AIIMS) ఆస్పత్రికి తరలించగా, వైద్య బృందం పర్యవేక్షణలో లైఫ్ సపోర్ట్ తొలగించారు. ఈ క్రమంలో ఎనిమిది రోజుల తర్వాత హరీశ్ రాణా (Harish Rana) తుదిశ్వాస విడిచాడు. భారతదేశంలో కోర్టు ద్వారా అధికారికంగా కారుణ్య మరణానికి అనుమతి పొంది మరణించిన మొదటి వ్యక్తిగా హరీశ్ రాణా నిలిచాడు.

Read Also: మోదీకి ట్రంప్ ఫోన్.. యుద్ధంపై చర్చ

Follow Us On: Facebook

 

 

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>