తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ తీరు.. నిప్పులు చెరిగిన సీతక్క

కలం, వెబ్ డెస్క్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై అసెంబ్లీలో మంత్రి సీతక్క (Minister Seethakka) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ ప్రభుత్వం చెప్పిందని.. అధికారంలోకి వచ్చి ఇన్ని ఏళ్ళు అయినా ఇవ్వట్లేదని ఫైర్ అయ్యారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఇచ్చిన విభజన హామీలను కేంద్రప్రభుత్వం ఇంకా అమలు చేయట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చి పన్నెండేళ్లవుతున్నా.. ఇప్పటి వరకు తెలంగాణ విషయంలో అన్యాయం జరుగుతూనే ఉందని దుయ్యబట్టారు. ఈ రాష్ట్రం నుంచి ఎనిమిది మంది ఎంపీలను గెలిపిస్తే.. నిధులు తేవలసిన బాధ్యత ఉన్న వాళ్ళు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం సహకరించకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను, ఉచిత విద్యుత్, సన్నబియ్యం బోనస్ వంటి పథకాలను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. MGNREGS లో కేంద్రం తెచ్చిన మార్పుల వల్ల పని దినాలు తగ్గి రాష్ట్రంపై భారం పడుతోందని విమర్శించారు.

చట్టం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడంపై మంత్రి సీతక్క అభ్యంతరం వ్యక్తం చేశారు. గత పదేళ్లుగా వికలాంగులు, వితంతువుల పెన్షన్లు పెంచని బీజేపీ (BJP), బడా పారిశ్రామికవేత్తలకే రూ.16 లక్షల కోట్ల రుణమాఫీ చేసిందని ఎద్దేవా చేశారు. కేంద్రం రైతులను విస్మరించిందని మండిపడ్డారు. గాంధీజీని చంపిన గాడ్సేకు RSSతో సంబంధం లేదా? అని ప్రశ్నించారు. విభజన హామీలు నెరవేర్చకుండా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తే ఉపయోగం లేదని సెటైరికల్ కామెంట్స్ చేశారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 4.70 లక్షల మంది మహిళలు వ్యాపారాలు ప్రారంభించారని తెలిపారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>