రెండేళ్లు గడిచినా సీఎం పేరును గుర్తుపెట్టుకోవట్లేదు : కేటీఆర్​

కలం, వెబ్​ డెస్క్​ : మాజీ మంత్రి, బీఆర్​ఎస్ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మరోసారి సీఎం రేవంత్​ రెడ్డిపై పంచులు వేశారు. రెండేళ్లు గడిచినా ముఖ్యమంత్రి పేరును ఎవరూ గుర్తు పెట్టుకోవట్లేదని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్​ లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో కేటీఆర్​ మాట్లాడారు. ఈ సందర్భంగా శనివారం శంషాబాద్ లో నిర్వహించిన ఓ కంపెనీ ప్రారంభోత్సవంలో యాంకర్..​ సీఎం రేవంత్​ రెడ్డి పేరుకు బదులుగా.. సీఎం దుద్దిళ్ల శ్రీధర్​ బాబు అని పిలిచిందని ఆయన (KTR) గుర్తు చేశారు.

రేవంత్​ రెడ్డిని యాంకర్లు, యాక్టర్​ పట్టించుకోవడం లేదని.. ప్రజలు కూడా ఆయన పేరు చెబితే ముఖం చాటేస్తున్నారన్నారు. రేవంత్​ ను ఎవరూ దేకడం లేదని.. గుర్తింపు కోసం ఆయన తహతహలాడుతున్నాడన్నారు. మూడు, నాలుగు ఫీట్లు ఉన్నోళ్లు కూడా మాజీ సీఎం కేసీఆర్ ను తిడుతున్నారని రేవంత్​ రెడ్డిని ఉద్దేశించి కామెంట్​ చేశారు. బీఆర్ఎస్​ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులు, కంపెనీలను రేవంత్​ రెడ్డి రిబ్బన్​ కటింగ్లు చేసి ప్రారంభిస్తున్నారని కేటీఆర్​ ఆరోపించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>