కలం, వెబ్ డెస్క్ : టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ ప్రస్తుతం వెంకటేష్ మహా దర్శకత్వంలో రూపొందుతున్న ‘రావు బహదూర్’ (Rao Bahadur) సినిమాలో నటిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు GMB ఎంటర్టైన్మెంట్ సమర్పణలో అనురాగ్, శరత్, గోపాలకృష్ణ ఈ మూవీని నిర్మిస్తుండడం విశేషం. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. ఈ ఏడాది జూన్ న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ మేరకు అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు.
దీపా థామస్ హీరోయిన్‌గా నటించిన ఈ సైకలాజికల్ థ్రిలర్ నుంచి రిలీజైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. డైరెక్టర్ మహా దర్శకత్వంలో వచ్చిన ‘కేరాఫ్ కంచరపాలెం’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. పైగా ఈ సినిమాకు సూపర్ స్టార్ మహేశ్ బాబు సమర్పకుడిగా ఉన్నారు. దీంతో ‘రావు బహదూర్’ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్ర ట్రైలర్ కూడా విడుదలై అది కూడా ఆకట్టుకునే విధంగా ఉంటే అంచనాలు తారాస్థాయికి చేరుకుంటాయని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.

