కలం మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లా ఇస్నాపూర్‌లో నలుగురు విద్యార్థినులు అనుమానాస్పద రీతిలో అదృశ్యమవ్వడం కలకలం రేపుతోంది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బీహార్‌కి చెందిన నలుగురు బాలికలు కనిపించకుండా పోయారు. ఈ నెల 23న ఎప్పటిలాగే పాఠశాలకు వెళ్తున్నామని ఇళ్ల నుంచి బయలుదేరిన ఈ విద్యార్థినులు, సాయంత్రమైనా తిరిగి ఇంటికి చేరుకోలేదు. ఆందోళన చెందిన కుటుంబసభ్యులు పాఠశాలకు వెళ్లి విచారించగా, ఆ రోజు బాలికలు అసలు బడికే రాలేదని ఉపాధ్యాయులు, సిబ్బంది స్పష్టం చేశారు.
బంధువులు, తెలిసిన వారి ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పటాన్‌చెరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పటాన్‌చెరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ విజువల్స్ పరిశీలిస్తూ బాలికల కోసం గాలిస్తున్నారు.
మిస్సింగ్ అయిన విద్యార్థినులు వీరే
- ఖుష్బు కుమారి(16)
- మహిమా కుమారి (12)
- రోజా కుమారి(12)
- ప్రియా కుమారి (12)

