ఆస్ప‌త్రిలో ష‌ర్మిల‌.. ఏమైందంటే?

క‌లం, వెబ్‌డెస్క్‌: ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల (YS Sharmila) ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ ఫోటోను ష‌ర్మిల స్వ‌యంగా త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. తాజాగా త‌న‌కు పొత్తి క‌డుపున‌కు సంబంధించిన‌ శ‌స్త్ర‌చికిత్స జ‌రిగింద‌ని, ప్ర‌స్తుతం తాను కోలుకుంటున్నాన‌ని తెలిపారు. త‌న కోసం ప్రార్థ‌న‌లు చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ ష‌ర్మిత ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు.

త‌న అభిమానులు, శ్రేయోభిలాషుల ప్రేమ, అండ‌దండ‌లు త‌న‌కు ఎంతో బ‌లాన్ని ఇస్తాయ‌ని ష‌ర్మిల‌ తెలిపారు. ఈ విష‌యం తెలుసుకున్న ప‌లువురు ఏపీ కాంగ్రెస్ నాయ‌కులు, వైఎస్ ష‌ర్మిల అభిమానులు ఆమె త్వ‌ర‌గా కోలుకోవాల‌ని, మ‌ళ్లీ ప్ర‌జా క్షేత్రంలోకి రావాల‌ని కామెంట్లు పెడుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>