Mobile Popup Ad
Mobile Popup Ad

బీఆర్ఎస్‌లోకి జీవన్ రెడ్డి.. నేడు కేటీఆర్‌తో భేటీ

కలం, కరీంనగర్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసిన జీవన్ రెడ్డి (Jeevan Reddy)  బీఆర్ఎస్‌లో చేరడం దాదాపు ఖాయమైనట్టే కనిపిస్తోంది. ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారని వార్తలు వస్తున్నా ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరడం లాంచనమేనని తెలుస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) గురువారం జగిత్యాల వెళ్లి జీవన్ రెడ్డిని కలవబోతున్నారు. జీవన్ రెడ్డి నివాసంలో వీరి భేటీ జరగనున్నది. అంతకు ముందుకు మధ్యాహ్నం 12.30 గంటలకు ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ నేతలతో కరీంనగర్‌లోని ఆర్అండ్‌బీ గెస్‌హౌస్‌లో సమావేశం కానున్నట్టు సమాచారం. అనంతరం జీవన్ రెడ్డితో భేటీ జరగబోతున్నది.

కాంగ్రెస్‌లో నాలుగు దశాబ్దాలుగా పార్టీకి సేవలందించిన టీ జీవన్ రెడ్డి (Jeevan Reddy) పార్టీ మారడం తెలంగాణ రాజకీయాల్లో, కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా ఆయన ఏ పార్టీలో చేరాలన్న నిర్ణయం తీసుకోలేదన్న సంశయానికి దాదాపు తెరపడింది. జీవన్ రెడ్డి ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ప్రతిపక్ష బీఆర్ఎస్ అయితేనే నియోజకవర్గానికి మేలు జరుగుతుందని ఆయన భావిస్తున్నట్లు సన్నిహితుల ద్వారా ప్రచారముంది. జగిత్యాల రాజకీయాల్లోనే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా నిలిచిన జీవన్‌రెడ్డి సుమారు 42 ఏండ్లు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు.

గత కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాల పట్ల ఆయన తీవ్ర అసంతప్తితో ఉండి మార్చి 25న కాంగ్రెస్ కు రాజీనామా చేసి సీఎం రేవంత్ రెడ్డిపైనే యుద్దం ప్రకటించారు. జీవన్ రెడ్డి 1985 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా వివిధ హోదాల్లో పని చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ రంగప్రవేశం చేసినప్పటికీ ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి వివిధ హోదాలక్లో పనిచేశారు. అయితే జీవన్ రెడ్డి అసంతృప్తికి అనేక కారణాలున్నాయి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడం జీవన్ రెడ్డికి ఏమాత్రం రుచించకపోవడంతో చివరకు పార్టీని వీడారు.  సీఎం రేవంత్ రెడ్డిపైనే ఆయన యుద్దం మొదలు పెట్టినట్లు ప్రకటించారు.

Read Also: నామినేషన్ అనంతరం మమతా బెనర్జీ సంచలన ట్వీట్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>