కలం, వెబ్ డెస్క్: పశ్చిమబెంగాల్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. బీజేపీ ఈ రాష్ట్రాన్ని చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. ఎట్టి పరస్థితుల్లోనూ గెలవాలని కంకణం కట్టుకున్నది. ఇక మమతా బెనర్జీ (Mamata Banerjee) కూడా అదే స్థాయిలో అధికారం నిలబెట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. బుధవారం ఆమె నామినేషన్ వేసిన అనంతరం ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. ‘ప్రజలే నా బలం, ప్రజాస్వామ్యమే నా మార్గం అనే నమ్మకంతో నామినేషన్ దాఖలు చేశాను. నేను చేసిన ప్రతి పని నా ప్రజల సంక్షేమం కోసమే చేశాను. వారి నమ్మకం, ప్రేమ, మద్దతే ఈ ప్రయాణాన్ని ముందుకు నడిపించాయి. బెంగాల్ అభివృద్ధిని కాపాడటానికి నిత్యం ప్రయత్నిస్తున్నాను. ఈ రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లాలని కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి.
ప్రజలు ఇచ్చినబలంతో నేను ఆ శక్తులపై పోరాడుతున్నాను. ఈరోజు నాకు లభించిన ప్రేమ, ఆశీర్వాదాలు మనం ఏ విలువల కోసం నిలబడ్డామో మరింత స్పష్టంగా గుర్తుచేశాయి. ఐక్యత, గౌరవం, అభివృద్ధిని ఎంచుకునే బెంగాల్ అదే మన లక్ష్యం. ఇక్కడ ప్రతి కులం, ప్రతి మతం, ప్రతి వర్గం సమానమే. అదే మన బలం, మన అసలు గుర్తింపు. ఈ పోరాటం ప్రజాస్వామ్యం కోసం, మీ గుర్తింపు కోసం, మీ ఇల్లు కోసం, మీ హక్కుల కోసం మనమంతా కలసి గెలవాల్సిన పోరాటం. రాష్ట్రవ్యాప్తంగా తృణమూల్ కాంగ్రెస్ (TMC) అభ్యర్థులను మద్దతు ఇచ్చి, అభివృద్ధి దిశగా ఈ సామూహిక సంకల్పాన్ని మరింత బలపరచాలని బెంగాల్ ప్రజలందరిని కోరుతున్నాను.’ అంటూ మమతా బెనర్జీ (Mamata Banerjee) కోరారు.
Read Also: విజయ్‌కు బిగ్ షాక్.. ఎన్నికల ముందే ఒక సీటు కోల్పోయిన టీవీకే
Follow Us On: X(Twitter)

