Mobile Popup Ad
Mobile Popup Ad

నెక్లెస్ రోడ్ జలవిహార్ సమీపంలో భారీ పేలుడు

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ నెక్లెస్‌ రోడ్డులోని జలవిహార్‌ సమీపంలోని ఆర్‌ఓ ప్లాంట్‌లో (Jalavihar) బుధవారం సాయంత్రం పేలుడు చోటు చేసుకుంది. ఆర్వో ప్లాంట్‌లో పేలుడు సంభవించడంతో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా.. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను గాంధీ ఆసుపత్రికి తరలించారు. పేలుడు ధాటికి ఆర్వో ప్లాంట్ పరికరాలు ముక్కలైపోయాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గాయపడ్డవారిని అప్పలనాయుడు, లక్ష్మణ్, అంజిలుగా గుర్తించారు. అంతర్గత ఒత్తిడి వల్లే ఆర్వో యంత్రంలో పేలుడు సంభవించినట్లుగా నిర్ధారించారు. ప్లాంట్ నిర్వహణ లోపాలపై విచారణ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Read Also: జూ.ఎన్టీఆర్ స్పెషల్ ట్వీట్.. బన్నీ షాకింగ్ రిప్లై..!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>