Mobile Popup Ad
Mobile Popup Ad

అసెంబ్లీలో ఆసక్తికర ఘటన.. BJLP లోకి కేటీఆర్..?

కలం, వెబ్​ డెస్క్​ : తెలంగాణ అసెంబ్లీ లాబీలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మధ్య సరదా సంభాషణ జరిగింది. రాజాసింగ్ BJLP చాంబర్ లోకి వెళ్ళిరావడాన్ని అటు వైపు వెళ్తున్న కేటీఆర్ గమనించారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగం తర్వాత ఈ ఘటన జరిగింది. దీంతో సస్పెండ్ అయిన వ్యక్తి లోపలికి ఎలా వెళ్తారని కేటీఆర్ (KTR) సెటైర్ వేశారు. రాజాసింగ్ వెంటనే బయటకు రావాలంటూ సంభాషించారు.

ఈ సంభాషణను పక్కనే ఉన్న మరో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గమనించారు. మీరు కూడా BJLPలోకి రావాలని కేటీఆర్ ను ఆహ్వానించారు. దీంతో వెంటనే స్పందించిన కేటీఆర్.. తాను బీజేపీ చాంబర్ లోకి వస్తే మీడియా వాళ్లు ఇంకేదో రాస్తారు అంటూ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక బీఆర్ఎస్, బీజేపీ మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ ఆసక్తికరంగా మారింది. మరోవైపు BJLP చాంబర్ లోకి వెళ్లడంపై రాజాసింగ్ స్పందించారు. పాత ఫ్రెండ్స్, పాత పార్టీ .. నేను ఎప్పుడైనా పోతాను. ఎప్పుడైనా వస్తాను అన్నారు. మళ్లీ పార్టీలో జాయిన్ కావడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఎవరూ ఎవరిని బతిమలుతున్నారో అనే విషయం భవిష్యత్ లో తెలుస్తోందని చెప్పుకొచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>