పాత పీఎఫ్ అకౌంట్లను ఇలా మెర్జ్ చేస్కోండి !

కలం, వెబ్ డెస్క్: ఉద్యోగం మారిన ప్రతిసారీ కొత్త పీఎఫ్ ఖాతా (EPF Account) తెరుస్తున్నారా? అయితే మీ పాత ఖాతాలన్నింటినీ వెంటనే విలీనం చేసుకోవడం మంచిది. మీ సర్వీస్ రికార్డ్ కరెక్ట్‌గా ఉండాలన్నా, రిటైర్మెంట్ సమయంలో డబ్బు సులభంగా రావాలన్నా అన్ని ఖాతాలు ఒకే చోట ఉండటం తప్పనిసరి. అయితే ఇంతకాలం ఇలా వేరువేరుగా ఉన్న ఖాతాలను ఒకే ఖాతాగా మెర్జ్ చేసుకోవాలంటే పీఎఫ్ ఆఫీసు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. ఈ ప్రక్రియను ఆన్‌లైన్‌లోనే పూర్తి చేసుకోవచ్చు.

అసలు మెర్జ్ ఎందుకు చేయాలి?

వేర్వేరు ఖాతాలు ఉంటే పీఎఫ్ డబ్బు తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అన్నింటినీ ఒకే యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)కు లింక్ చేయడం వల్ల నిర్వహణ సులభమవుతుంది. కొత్త కంపెనీలో చేరినప్పుడు మీ పాత UAN వివరాలను అందిస్తే, కొత్త ఖాతా పాత వాటితో అనుసంధానమవుతుంది. దీనివల్ల వడ్డీ కూడా సక్రమంగా జమ అవుతుంది.

ఆన్‌లైన్ ద్వారా విలీనం చేసే విధానం

ముందుగా epfindia.gov.in పోర్టల్‌లో మీ UAN, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి. ‘Online Services’ ట్యాబ్‌లోకి వెళ్లి ‘One Member – One EPF Account’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. మీ పాత పీఎఫ్ మెంబర్ ఐడి లేదా పాత UAN వివరాలను నమోదు చేసి ‘Get Details’ పై క్లిక్ చేయాలి. పాత అకౌంట్ వివరాలు వచ్చాక, ‘Get OTP’ బటన్ నొక్కితే మీ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసి రిక్వెస్ట్‌ను సబ్మిట్ చేయాలి. మీరు సబ్మిట్ చేసిన అభ్యర్థనను ప్రస్తుత యాజమాన్యం ఆమోదించాల్సి ఉంటుంది. వారు ఓకే చేసిన తర్వాత, ఈపీఎఫ్ఓ అధికారులు పాత ఖాతాలను కొత్త దానితో విలీనం చేస్తారు. ఈ ప్రక్రియ సజావుగా సాగాలంటే మీ UAN యాక్టివ్‌గా ఉండాలి. అలాగే ఆధార్, బ్యాంక్ ఖాతా, పాన్, మొబైల్ నంబర్ తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి. పాత ఖాతాల్లోని నగదును భద్రపరుచుకోవడానికి ఈ విలీన ప్రక్రియ ఎంతో ఉపయోగకరం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>