Mobile Popup Ad
Mobile Popup Ad

కుప్పకూలుతున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?

కలం, వెబ్​ డెస్క్​ : బంగారం కొనుగోలు వినియోగదారులకు భారీ శుభవార్త అందుతోంది. బంగారం (Gold), వెండి (Silver) ధరలు సోమవారం కూడా మళ్లీ దిగొచ్చాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,56,102కి పడిపోయింది. నిన్నటి (ఆదివారం) ధరతో పోల్చుకుంటే దాదాపు రూ. 2,836 మేర తగ్గుదల నమోదు చేసింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (Gold) ధర 1,42,989కి దిగొచ్చింది. నిన్నటి ధరతో పోల్చుకుంటే దాదాపు 2,598 మేర తగ్గింది. అటు కిలో వెండి (Silver) ధర కూడా భారీగా తగ్గింది. కేజీ వెండి 6,319 తగ్గి ప్రస్తుతం రూ. 2,53,614 వద్ద ట్రేడ్ అవుతోంది. ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. కాగా, డాలర్ బలం, చమురు పెరగడంతో ఇటు బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఉగాది పండుగ సమయంలో ధరలు తగ్గడంలో పసిడి ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ధరలు చూసి బంగారం కొనే టైం వచ్చిందని కొనుగోలుదారులు భావిస్తున్నారు.

ఇదిలాఉంటే ఇరాన్ యుద్ధం కారణంగా మార్కెట్లు పెరగాల్సింది పోయి తగ్గడం అనుమానాలకు తావిస్తోంది. భవిష్యత్ లో బంగారం, వెండి ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఇన్వెస్టర్లు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా వెళ్తున్నారు. డాలర్ బలపడటంతో అటువైపుగా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>