రూ. 94 వేల కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి సాధ్యమేనా?: కేటీఆర్

కలం, వెబ్ డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు తెలంగాణ ప్రజల గెలుపు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పేర్కొన్నారు. నిజం నిలకడ మీద తెలుస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేసిందని విమర్శించారు. రూ. 94 వేల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రచారం చేసిందని ఫైర్ అయ్యారు.

అబద్ధాన్ని నిజం చేసే కుట్ర

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అబద్ధాలను నిజం చేసే కుట్ర పన్నారని కేటీఆర్ (KTR) ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నుంచి కిందిస్థాయి కార్యకర్త వరకు అంతా తప్పుడు ప్రచారమే చేశారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టు కట్టడమే తప్పు అన్నట్టుగా ప్రవర్తించారని మండిపడ్డారు. కోర్టు తీర్పుతో నిజాలు బయటపడ్డాయని చెప్పారు. కేసీఆర్ మీద బురద జల్లాలని ప్రయత్నిస్తే నిప్పులాంటి నిజాలు బయటకు వచ్చాయని వివరించారు.

కాళేశ్వరం గొప్పతనం బయటపడకుండా కుట్ర

కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం బయటపడకుండా రేవంత్ రెడ్డి కుట్ర చేశారని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో పారుతున్న ప్రతి నీటిబొట్టు కేసీఆర్ పుణ్యమేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా నిజాలు దాగవని చెప్పారు. కాంగ్రెస్‌తో పాటు బీజేపీ సైతం సిగ్గువిడిచి తప్పుడు ప్రచారం చేసిందని ఫైర్ అయ్యారు. ‘ఈ తీర్పుతోనైనా తప్పుడు ప్రచారం చేసేవాళ్లకు జ్ఞానోదయం కలగాలి. తెలంగాణ రైతాంగానికి కాళేశ్వరం వరప్రదాయిని. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు శనేశ్వరం. కాళేశ్వరం అంటే కేవలం ఒక్క బ్యారేజ్ మాత్రమే కాదు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్’ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.

కూలింది కాళేశ్వరం కాదు కుట్రలు

కాళేశ్వరం కూలిందంటూ ఇంతకాలం రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేశారని.. నిజానికి కూలింది కాళేశ్వరం కాదు రేవంత్ రెడ్డి, విపక్షాల కుట్రలు అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేవలం 600 కోట్ల నష్టం జరిగిందని.. కూలిపోయిన పిల్లర్లను ఎల్ అండ్ టీ సంస్థ బాగు చేస్తామని ప్రకటించినా రేవంత్ రెడ్డి రాజకీయ దురుద్దేశ్యంతో అడ్డుకున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఎల్ అండ్ టీ సంస్థను కూడా రేవంత్ రెడ్డి బెదిరించారని కేటీఆర్ ఆరోపించారు. విద్యుత్ కమిషన్, కాళేశ్వరం కమిషన్ అంటూ కాంగ్రెస్ పార్టీ డ్రామాలు ఆడుతోందని విమర్శించారు. అన్ని ప్రచారాలకు హైకోర్టు తీర్పుతో చెంపపెట్టు తగిలినట్టైందని కేటీఆర్ పేర్కొన్నారు.

Read Also: రేపే ఎన్నికలు.. ఒక్క ఓటుకు రూ.25 వేలు!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>