Mobile Popup Ad
Mobile Popup Ad

సీఎం లేఖ రాస్తే CBI దర్యాప్తుకి రెడీ : ఎంపీ రఘునందన్ రావు

కలం, వెబ్ డెస్క్ : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీబీఐ దర్యాప్తు చేయాలని కేంద్రానికి లేఖ రాస్తే తాము సిద్ధంగా ఉన్నామని బీజేపీ నాయకుడు, ఎంపీ రఘునందన్ రావు (MP Raghunandan Rao) స్పష్టం చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీశ్ రావులకు తెలంగాణ హైకోర్టు ఊరట ఇచ్చిన నేపథ్యంలో స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో (Kaleshwaram Project) కేవలం మూడు బ్యారేజీల నిర్మాణాలపైనే విచారణ జరపాలని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేశారని ఆయన గుర్తుకు తెచ్చారు. కానీ, మొత్తం ప్రాజెక్టుపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. రాష్ట్ర ప్రభుత్వంతో విచారణ చేత కాదని కేంద్రానికి లేఖలు రాస్తోందని రఘునందన్ రావు ఎద్దేవా చేశారు.

అవినీతిపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కై డూప్ ఫైటింగ్ చేస్తున్నాయని రఘునందన్ రావు ఆరోపించారు. తెలంగాణలో అధికారం చేపడితే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి సొమ్మును బయటకు తీస్తామని రాహుల్ గాంధీ, రేవంత్ వాగ్దానం చేశారని.. కానీ ఇప్పుడు కేంద్రానికి లేఖలు రాస్తున్నారన్నారు. అవినీతిని బయటకు తీసేందుకు విచారణ అంటూ పీసీ ఘోష్ కమిషన్ పేరుతో రెండు సంవత్సరాల పాటు కాలయాపన చేశారని ఆయన విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన సంస్థకే సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ మూసీ రివర్ డెవలప్‌మెంట్ ఫ్రంట్ ప్రాజెక్టు అప్పగించారని కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్, కేసీఆర్ వేర్వేరు కాదని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినా కేసీఆర్ కుటుంబ సభ్యులపై రేవంత్ రెడ్డి ఒక్క చర్య కూడా తీసుకోలేదని దుయ్యబట్టారు. పేరు మార్చుకుంటానని ఉత్తర ప్రగల్భాలు పలికే రేవంత్ రెడ్డి.. హామీలను అమలు చేసి చేతల్లో చూపించాలని రఘునందన్ రావు (MP Raghunandan Rao) సవాల్ విసిరారు.

Read Also: రేపే ఎన్నికలు.. ఒక్క ఓటుకు రూ.25 వేలు!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>