రేపే ఎన్నికలు.. ఒక్క ఓటుకు రూ.25 వేలు!

కలం, వెబ్ డెస్క్: తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికలకు రేపు పోలింగ్ జరగబోతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు డబ్బుల పంపిణీని ప్రారంభించాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రలోభాల పర్వానికి తెరదీశాయి. మైలాపూర్ నియోజకవర్గంలో డీఎంకే అభ్యర్థి వేణు అనుచరులు ఒక్క ఓటుకు రూ.25 వేలు పంచుతుండగా అధికారులు పట్టుకున్నారు. ఎన్డీయే అభ్యర్థి తమిళి సై (Tamilisai) ఫిర్యాదుతో ఎన్నికల అధికారులు సోదాలు చేయగా, నోట్ల కట్టలు బయటపడ్డాయి. కృష్ణరాయపుర నియోజకవర్గ ఏఐడీఎంకే అభ్యర్థి డాక్టర్ దివ్య తరఫున పంపిణీ చేస్తున్న కుక్కర్లను స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు రూ.1230 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్ వెల్లడించారు.

త్రిముఖ పోరు.. దేశమంతటా ఆసక్తి!

తమిళనాడులో (Tamil Nadu) 234 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. అధికార డీఎంకే, అన్నాడీఎంకే ఆధ్వర్యంలోని ఎన్డీయే, నటుడు విజయ్ టీవీకే పార్టీల మధ్య త్రిముఖ పోరు నెలకొంది. ఇప్పటివరకు విడుదలైన సర్వేలు డీఎంకే పార్టీనే మరోసారి విజయం సాధిస్తుందని చెప్పినా.. తమిళనాడులో ఏ పార్టీకి ఓటర్లు వరుసగా రెండోసారి అవకాశం ఇవ్వలేదు. ఈసారి, విజయ్ రూపంలో మరో బలమైన ప్రత్యర్థి ఉండటంతో.. ఎవరు గెలుస్తారనేది దేశ వ్యాప్తంగా ఉత్కంఠగా మారింది.

Read Also: లీగల్ బ్యాటిల్ టు స్ట్రీట్ ఫైట్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పొలిటికల్ స్ట్రాటెజీ…

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>