కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో పనిచేస్తున్న ఆరుగురు సీనియర్ ఐపీఎస్ ( IPS Officers) అధికారులకు తెలంగాణ ప్రభుత్వం (Telangna Govt) డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) స్థాయికి పదోన్నతి కల్పించింది. 1995, 96 బ్యాచ్ లకు చెందిన అధికారులకు పదోన్నతి దక్కింది. 1995 బ్యాచ్ కు చెందిన ఏడీజీలు మహేశ్ భగవత్, స్వాతి లక్రా, వీవీ శ్రీనివాసరావులకు డీజీపీలుగా పదోన్నతి లభించింది. అలాగే 1996 బ్యాచ్ కు చెందిన చారుసిన్హా, అనిల్ కుమార్, సజ్జనార్ లకు డీజీ ర్యాంక్ ను పొందారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు జీవో విడుదల చేశారు.
Read Also: అప్రోచ్ రోడ్ల నిర్మాణాలకు రూ.148 కోట్లు విడుదల : డిప్యూటీ సీఎం భట్టి
Follow Us On : WhatsApp

