కక్ష ఉంటే నా మీద తీర్చుకొండి.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్

కలం, వెబ్ డెస్క్: ఫార్ములా-ఈ రేసింగ్ కేసు (Formula-e Race Case) ఒక లొట్ట పీస్ కేసు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మరోసారి మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల డైవర్షన్ కోసమే ఫార్ములా -ఈ కేసు చార్జ్ షీట్ అని ఫైర్ అయ్యారు. ప్రజల దృష్టిని మరల్చడానికే చార్జ్ షీట్ తో మరోసారి రేవంత్ ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు. న్యాయస్థానాల్లో ఫార్ములా-ఈ రేసు కేసు నిలబడదని అభిప్రాయపడ్డారు. ఈకేసులో ఎవరికైతే లబ్ధి జరిగిందని చెప్తున్నారో.. వారితో రేవంత్ దావోస్ లో మంతనాలు జరిపారని ఆరోపించారు. కక్ష ఉంటే తన మీద తీర్చుకోవాలని.. అధికారులను ఎందుకు బలి‌ చేస్తున్నారు? అని ప్రశ్నించారు. ఈ వ్యవహారం విషయంలో డబ్బులు చెల్లింపుపై తానే మంత్రిగా నిర్ణయం తీసుకున్నానని.. దమ్ముంటే తన మీద చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎక్కడా డబ్బులు దారి మళ్ళలేదని.. తప్పు జరగలేదని చెప్పారు. బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సక్షన్ జరిగిందన్నారు. కట్టింది రూ.45 కోట్లు అయితే.. రూ.700 కోట్లు నష్టనివారణ జరిగిందని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.రూ. 45 కోట్లు ఇంకా బ్యాంక్ లోనే ఉన్నాయని.. డబ్బులు ఎందుకు రికవరీ చేయటం లేదు? అని ప్రశ్నించారు.

ఆరు గ్యారంటీలపై ప్రైవేట్ మెంబర్ బిల్లుకు అనుమతించాలని స్పీకర్ ను కోరినట్లు కేటీఆర్ వివరించారు. ప్రైవేట్ మెంబర్ బిల్లు నుంచి డైవర్షన్ కోసమే ఫార్ములా-ఈ కేసు చార్జ్ షీట్ అని ఆరోపించారు. ఆరు గ్యారంటీలపై సభలో ప్రభుత్వం ఇరుకున పడుతుందన్నారు. ఫార్ములా కేసులో పస లేదని ప్రభుత్వానికి కూడా తెలుసు అని చెప్పారు. చార్జ్ షీట్ లో లబ్ది పొందిన వారి పేరు ఎందుకు పెట్టలేదు? అని ప్రశ్నించారు. ఎన్ని వందల కోట్లు చేతులు మారాయో రేవంత్ చెప్పాలి? అని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ప్రతిష్ఠ పెంచటానికే ఫార్ములా ఈ రేసింగ్ అని.. రేసు వలన రూ. 700 కోట్లు లాభం జరిగిందని నెల్సన్ అనే సంస్థ చెప్పిందన్నారు. రేసు నిర్వహించటం వలన రాష్ట్రంలో పెట్టుబడులను అట్రాక్ట్ చేశామని చెప్పారు.

రాష్ట్రంలో రూ. 200 కోట్లతో జరిపిన అందాల పోటీలతో రెండు రూపాయలు కూడా రాలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. పైగా ప్రభుత్వం నవ్వుల పాలైందన్నారు. మాగీ అనే అమ్మాయి తనను వేశ్య మాదిరి చూశారని ఆరోపించిందని మరోసారి చెప్పారు. మరి కాంగ్రెస్ నేతలపై ఎందుకు సిట్ ను నియమించలేదు? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సరదా కోసం రూ.100 కోట్లు ఖర్చు చేసి ఫుట్బాల్ ఆటగాడు మెస్సీని తీసుకొచ్చారని అన్నారు. మరి సీఎం, మంత్రులపై ఎందుకు కేసులు వేయలేదని ప్రశ్నించారు. న్యాయస్థానాలపై తనకు నమ్మకం ఉందని.. ఈ వ్యవహారంపై కోర్టుల్లో కొట్లాడుతామని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక టీడీఆర్ (TDR) పై విచారణ జరుపుతామన్నారు. టీడీఆర్ బాండ్ లన్నీ సీఎం కుటుంబ సభ్యులే కొనుగోలు చేశారని.. టీడీఆర్ అంటే తిరుపతి రెడ్డి అని ఆరోపించారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>