కలం, వెబ్ డెస్క్ : పశ్చిమాసియా యుద్ధంపై ప్రధాని నరేంద్ర మోదీతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) ఫోన్ లో మాట్లాడారు. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. హర్మూజ్ జలసంధిపై మోదీతో మాట్లాడారు ట్రంప్. హర్మూజ్ జలసంధి తెరిచి ఉంటే ప్రపంచానికి జరిగే లాభం గురించి వీరిద్దరూ ప్రధానంగా మాట్లాడుకున్నారని అమెరికా రాయబారి సర్జయో గోర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. కానీ ప్రధాని మోదీ (PM Modi), ట్రంప్ ఫోన్ కాల్ పై పూర్తి వివరాలను సర్జియో బయటపెట్టలేదు.
అటు యుద్ధంపై ట్రంప్ బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నిన్నటి నుంచి ఐదు రోజుల పాటు ఇరాన్ మీద దాడులు చేయబోమని తెలిపారు. ఇరాన్ తో మంచి చర్చలు జరుగుతున్నాయని.. అన్నీ ఫలిస్తాయంటూ తెలిపారు. కానీ అటు ఇరాన్ మాత్రం ఎలాంటి చర్చలు జరపట్లేదని.. ఎవరికీ తాము లొంగేది లేదంటూ తేల్చి చెబుతోంది. ఇలాంటి పరిస్థితుల నడుమ మోదీకి ట్రంప్ ఫోన్ చయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

