కలం, వెబ్ డెస్క్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవారం సిరిసిల్లలో (Sircilla) పర్యటించిన నేపథ్యంలో మరోసారి చేదు అనుభవం ఎదురైంది. సిరిసిల్ల పర్యటనలో భాగంగా ఆయన పెద్దూరులోని బాబాజీ కాలనీకి వెళ్లగా, స్థానికులు ఆయనను అడ్డుకుని నిలదీశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తమ వార్డు కౌన్సిలర్ ఏమాత్రం పట్టించుకోలేదని, కనీస అభివృద్ధి పనులు కూడా చేపట్టలేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ల సమయంలో హామీలు ఇవ్వడం తప్ప, గెలిచాక సమస్యలను గాలికి వదిలేశారని కేటీఆర్ ఎదుటే అసహనం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.
మరోవైపు మెడికల్ కాలేజీ (Medical College) నిర్మాణానికి భూములు ఇచ్చిన బాధితులు కూడా తమ గోడును వెళ్లబోసుకున్నారు. కాలేజీ కోసం తమ భూములను సేకరించారని, కానీ ఇంతవరకు తమకు సరైన పరిహారం అందలేదని, న్యాయం జరగలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. భూములు కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోలేదని కేటీఆర్ (KTR) దృష్టికి తీసుకెళ్లారు. తమ సమస్యలను పరిష్కరించకుండా కేవలం పర్యటనలు చేస్తే సరిపోదని, తక్షణమే తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) నేపథ్యంలో ఇటు కేసీఆర్ (KCR), ఇటు కేటీఆర్ ప్రాతినిథ్యంలో వహిస్తున్న జిల్లాల్లో స్థానికుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతుండటం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది.
Read Also: సీఎం రేవంత్‌కు హరీశ్ రావు సవాల్
Follow Us On: Pinterest


