సీఎం రేవంత్‌కు హరీశ్ రావు సవాల్

కలం మెదక్ బ్యూరో: మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. సిగాచి మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి కోటి రూపాయల పరిహారం ఇస్తే, తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని తేల్చి చెప్పాడు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్, జిన్నారంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడారు. సిగాచి ప్రమాదంలో 54 మంది కార్మికులు చనిపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు.

మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చి ఒక్క రూపాయి ఇవ్వలేదని మండిపడ్డారు. మృతుల కుటుంబాలకు కంపెనీ 25 లక్షలు ఇచ్చింది కానీ.. రేవంత్ ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వలేదని హరీశ్ రావు (Harish Rao) ఆరోపించారు. హామీలతో మభ్యపెడుతున్న కాంగ్రెస్ (Congress)కు మున్సిపల్ ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పాలన్నారు.

Read Also: కానిస్టేబుల్ కుటుంబాల‌కు ఎక్స్ గ్రేషియా

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>