కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Telangana Assembly Budget Sessions) ఈనెల 26 నుంచి జరిగే అవకాశాలున్నాయి. దాదాపు రెండు వారాల పాటు నిర్వహించే అవకాశముంది. ప్రస్తుతానికి ముసాయిదా షెడ్యూలు మాత్రమే ఖరారైంది. ముఖ్యమంత్రి సహా మంత్రివర్గమంతా చర్చించిన తర్వాత నిర్దిష్టమైన షెడ్యూలు పైనల్ కానుంది. ఇప్పటికే చీఫ్ సెక్రటరీ పలు డిపార్టుమెంట్ల అధికారులతో రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించారు. త్వరలో ఆర్థిక శాఖ బాధ్యతలు చూస్తున్న డిప్యూటీ సీఎం ఆయా శాఖల మంత్రులు, అధికారులతో బడ్జెట్ సన్నాహక సమావేశాలను నిర్వహించనున్నారు.
ఇక మంత్రులంతా సమిష్టిగా చర్చించిన తర్వాత శాఖలవారీగా ప్రతిపాదనలు, కేటాయింపులపై స్పష్టత రానుంది. అనంతరం బడ్జెట్ సమావేశాలను (Telangana Budget Sessions) ఎప్పటి నుంచి నిర్వహించాలనే అంశంపై చర్చించి ఫైనల్ షెడ్యూలును రూపొందించనున్నారు. కేంద్ర బడ్జెట్‌పై సీఎం సహా మంత్రులు, అధికారులు ఇప్పటికే రివ్యూ చేశారు. ఏ మేరకు ఫండ్స్ వస్తాయనే అంశాలపై స్పష్టతకు వచ్చారు. ఇదే సమయంలో నెల రోజులుగా రాష్ట్ర బడ్జెట్ తయారీ కసరత్తు కూడా జరుగుతూ ఉంది. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి రానున్న నిధులపై అంచనా వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్‌లో గ్రాంట్స్ కేటగిరీలో ఫైనల్ ఫిగర్స్ చేరనున్నాయి. ఈసారి సెషన్‌లో శాసనసభ, శాసనమండలి సమావేశాలు ఒకే భవనంలో జరగనున్నాయి.
Read Also: సొంత ఇలాకాలో కేటీఆర్‌కు ఎదురుదెబ్బ
Follow Us On : WhatsApp


