Mobile Popup Ad
Mobile Popup Ad

బీజేపీ, కాంగ్రెస్ నిరూపిస్తే రాజీనామా చేస్తా: కేటీఆర్

కలం, వెబ్ డెస్క్ : కేసీఆర్ హయాంలో అభివృద్ధిలో తెలంగాణ నెం.1గా నిలిచిందని.. 3 శాతం జనాభా 5 శాతం జీడీపీ కాంట్రిబ్యూషన్ చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. 29 రాష్ట్రాల్లో మా కంటే ఎవరైనా బాగా చేశారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో శాంతిభద్రతలు అద్భుతంగా ఉన్నాయని.. అన్నమూ రామచంద్ర అన్న రాష్ట్రాన్ని దేశానికే అన్నం పెట్టే స్థాయికి తీసుకెళ్లామని చెప్పారు. రైతుబంధు అనే విప్లవాత్మక పథకాన్ని కేసీఆర్ తెచ్చారని గుర్తు చేశారు. జిల్లాకో మెడికల్ కాలేజ్ నిర్మించారన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణను కేసీఆర్ నెం.1గా చేశారని వెల్లడించారు. అయితే కేసీఆర్ హయాంలో అభివృద్ధి జరగలేదని కాంగ్రెస్, బీజేపీ నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు.

ప్రస్తుతం తెలంగాణలో అన్ని రంగాలు మందగమనంలో ఉన్నాయని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నినాదం రైజింగ్.. విధానం మాత్రం ఫాలింగ్ అంటూ ఎద్దేవా చేశారు. రెండేళ్లుగా ప్రభుత్వ ఆదాయం పతనమవుతోందని విమర్శించారు. కరోనా కంటే కాంగ్రెస్ డేంజర్ అని ప్రజలకు అర్థమైందని చెప్పుకొచ్చారు. 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ మాట తప్పిందని ఆరోపించారు. పెన్షన్ సొమ్ము పెంచలేదు, నిరుద్యోగ భృతి, మహిళలకు రూ. 2,500 ఇవ్వలేదు అని మండిపడ్డారు. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పిన రేవంత్, భట్టి.. రెండున్నర సంవత్సరాలు అయిన ఎందుకు అమలు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. అయితే అప్పుడు చేయడంలో రేవంత్ ప్రభుత్వం రికార్డులు సృష్టిందన్నారు. రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 4 లక్షల కోట్ల అప్పులు చేసిందని పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>