ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం: 21 మంది సజీవ దహనం

కలం, వెబ్ డెస్క్: దక్షిణ ఢిల్లీలో బుధవారం ఉదయం ఒక ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. మాలవీయ నగర్‌ పరిధిలోని హౌజ్ రాణి ప్రాంతంలో ఉన్న బహుళ అంతస్తుల లెమన్ గ్రీన్ రెస్టారెంట్ (Delhi Restaurant Fire) లో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ ఫైర్ సర్వీస్ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

పోలీసుల కథనం ప్రకారం.. బుధవారం ఉదయం 8:50 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఉదయం 9:45 గంటల సమయంలో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందడంతో వారు తక్షణమే రంగంలోకి దిగారు. రెస్టారెంట్ బేస్‌మెంట్‌లో చిక్కుకుపోయిన ముగ్గురు నైజీరియన్ పౌరులతో పాటు మరో 40 మందిని ఫైర్ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. దట్టమైన పొగ, మంటల కారణంగా వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మృతుల సంఖ్య పదికి చేరినట్లు ఢిల్లీ పోలీసులు ధృవీకరించారు. ప్రమాదానికి గల కారణాలపై ప్రస్తుతం అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.

Read Also: ‘పెద్ది’ హవా.. ఏపీలో రికార్డు స్థాయి టికెట్ ధరలు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>