జగిత్యాలలో కేసీఆర్ స‌భ‌.. కేటీఆర్ కీల‌క ప్ర‌క‌ట‌న‌!

కలం, కరీంనగర్ బ్యూరో: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ (KCR) ఆదేశాల మేరకు ఈ నెల 20న జగిత్యాల (Jagtial)లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ కోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఇన్‌చార్జ్‌ల‌ను ప్రకటించారు. స్వయంగా ఈ సభకు కేసీఆర్ హాజరు కానున్నారు. ఈ నేప‌థ్యంలో స‌భ‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ దీన్ని విజయవంతం చేసేందుకు సీనియర్ నాయకులకు కీల‌క‌ బాధ్యతలు అప్పగించింది. ప్రధానంగా జగిత్యాల జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు సంబంధించి ప్రత్యేక ఇన్‌చార్జ్‌ల‌ను కేటీఆర్ ఖరారు చేశారు.

జగిత్యాల నియోజకవర్గానికి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, కోరుట్లకు బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, ధర్మపురికి ఎమ్మెల్సీ ఎల్.రవీందర్ రావు, వేములవాడకు చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, చొప్పదండికి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిలను నియమించారు. సభకు జన సమీకరణ, ప్రాంగణ ఏర్పాట్లు, నిర్వహణ బాధ్యతలను పార్టీ సీనియర్ నేతలు గాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షించనున్నారు. వీరు క్షేత్రస్థాయిలో ఉండి సభ ముగిసే వరకు అన్ని ఏర్పాట్లను సమన్వయం చేస్తారని కేటీఆర్ (KTR) వెల్ల‌డించారు. పార్టీ శ్రేణులు సమన్వయంతో పని చేసి జగిత్యాల సభను గ్రాండ్ సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు.

Read Also: టైటిల్ కోసం అన్నా చెల్లెళ్ల ఫైట్.. ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>