ఎండ దెబ్బకు టిప్పర్ లారీ దగ్దం?

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు (Manuguru) మండలంలోని కొండాపూర్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్‌లో సోమవారం మధ్యాహ్నం చూస్తుండగానే టిప్పర్ లారీ క్యాబిన్ అగ్నికి ఆహుతైంది. బొగ్గు లోడింగ్ కోసం వెళ్లిన ఓ టిప్పర్ వాహనం సుమారు రెండు గంటల పాటు ఎండలో ఉండటంతో ఒక్కసారిగా క్యాబిన్‌లో మంటలు చెలరేగాయి. ఘటనను గమనించిన కార్మికులు వెంటనే అప్రమత్తమై మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయితే మంటలు వేగంగా వ్యాపించడంతో టిప్పర్ ముందు భాగం పూర్తిగా కాలిపోయింది. ఎండ తీవ్రత కారణంగా వాహనం దగ్ధమై ఉండొచ్చని కార్మికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Read Also: టైటిల్ కోసం అన్నా చెల్లెళ్ల ఫైట్.. ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>