Mobile Popup Ad
Mobile Popup Ad

కుంభకోణాలకు కేరాఫ్‌గా సింగరేణి : కేటీఆర్

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత సింగరేణి వరుస కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. సింగరేణిలో రూ.1600 కోట్ల కుంభకోణం జరిగిందని.. ఈ అవినీతిపై వెంటనే విచారణ చేపట్టాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కేటీఆర్ లేఖ రాశారు. సింగరేణి సంస్థ ప్రకటించిన నిల్వల నుంచి సుమారు 40 లక్షల టన్నుల బొగ్గు ఎలా మాయమైంది? అని ఆయన ప్రశ్నించారు.

ఇప్పుడు రూ. రూ. 1600 కోట్ల బొగ్గును సీఎం రేవంత్ రెడ్డి మాయం చేశారని.. స్టాక్ యార్డుల్లో ఉండాల్సిన బొగ్గును అప్పనంగా అమ్ముకున్నారని కేటీఆర్ ఆరోపించారు. రూ. 1600 కోట్ల విలువ చేసే బొగ్గు ఏమైందో వెంటనే తేల్చేందుకు విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. నైనీ కుంభకోణం నుంచి మొదలుకొని వందల అక్రమాల విషయంలో కేంద్రం స్పందించడం లేదన్నారు. నిలువలు తనిఖీ చేసే బొగ్గు గనుల శాఖ అధికారులు, కాగ్ అధికారులు ఇప్పటిదాకా ఎందుకు తనిఖీలు చేపట్టలేదని నిలదీశారు.

ఈ అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తినా కేంద్రం స్పందించడం లేదన్నారు. తెలంగాణ ప్రజల ఆస్తి అయిన సింగరేణి మనుగడను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దెబ్బతీస్తున్నాయని విమర్శించారు. రేవంత్ రెడ్డితో ఒప్పందం లేకపోతే వెంటనే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డిని కేటీఆర్ డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>