Mobile Popup Ad
Mobile Popup Ad

కేసీఆర్ ఆరాటం కమీషన్ల కోసమే: రేవంత్ రెడ్డి

కలం, వెబ్ డెస్క్: కేసీఆర్ పాలనలో పాలమూరు జిల్లా ప్రాజెక్టులను ఏ మాత్రం పట్టించుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆరోపించారు. ఆయన ఆరాటం మొత్తం కమీషన్ల కోసమేనని పేర్కొన్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి కావాల్సిన భూ సేకరణను చేపట్టలేదని ఫైర్ అయ్యారు. పాలమూరు జిల్లాలో ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల కోసం సుమారు 4 వేల ఎకరాల భూ సేకరణ చేయాల్సి ఉందన్నారు. నిర్వాసితులకు ప్యాకేజ్ కూడా అందించలేదన్నారు. కాల్వలకు భూ సేకరణ చేపట్టకుండా, రిజర్వాయర్లు కడితే ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. పాలమూరు జిల్లా అభివృద్ధి, ప్రాజెక్టుల అమలులో భారీగా లోపాలు ఉన్నాయని.. వాటిని సరిచేసుకుంటూ ముందుకు సాగుతున్నామన్నారు.

కల్వకుర్తి, భీమా, కోయిల్ సాగర్ వంటి ప్రధాన ప్రాజెక్టులు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయని విమర్శించారు. “ప్రాజెక్టులు నిర్మించేందుకు అవసరమైన భూ సేకరణే చేయలేదు. భూ సేకరణ చేయకుండానే ప్రాజెక్టులు ఎలా పూర్తి చేస్తారు?” అని సీఎం ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల పేరుతో భారీ అవినీతి జరిగిందని విమర్శించారు.

పాలమూరు జిల్లాలో లిఫ్టులు, పంపుల వ్యవస్థల నిర్మాణంలో అవినీతి జరిగినట్టు ఆరోపించారు. ఈ అంశంపై అప్పట్లో నాగం జనార్దన్ రెడ్డి పోరాటం చేశారని సీఎం గుర్తుచేశారు. కానీ ఇప్పుడు నాగం బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారని విమర్శించారు. గత ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో భారీగా అప్పులు చేసిందని ఆరోపించారు.

పాలమూరు జిల్లాలో “సుమారు 4 వేల ఎకరాల భూ సేకరణ చేయాల్సి ఉంది. అది చేయకపోతే ప్రాజెక్టులు ఎలా పూర్తవుతాయి. రిజర్వాయర్లలో నీళ్లు ఉన్నా ఉపయోగం ఏమిటి‘ అంటూ సీఎం మండిపడ్డారు. కాల్వలు, మెయిన్ కెనాల్స్ కోసం కూడా భూ సేకరణ జరగలేదని మండిపడ్డారు. “ప్యాకేజీలు ఇవ్వకుండా, భూ సేకరణ చేయకుండా నీళ్లు ఎలా అందిస్తాం?” అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం పాలమూరు జిల్లాలోని అన్ని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>