అండమాన్ దీవుల్లో రాహుల్ గాంధీ స్కూబా డైవింగ్

కలం, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) అండమాన్ నికోబార్ దీవుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్నార్కెలింగ్, స్కూబా డైవింగ్ చేసిన వీడియోలను ఎక్స్ లో పోస్ట్ చేశారు. రాహుల్ తన పోస్ట్‌లో “అండమాన్ నికోబార్ దీవులు ప్రపంచంలోనే అత్యంత అందమైన తీరప్రాంత పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసుకోవడానికి అపార సామర్థ్యం ఉంది. దీనికి పర్యావరణ సమతుల్యత, స్థిరమైన అభివృద్ధి ప్రాధాన్యత ఇవ్వాలి” అని రాసుకొచ్చారు. ఈ దీవుల్లోని అద్బుతమైన కోరల్ రీఫ్స్‌ను చూడాలని ఆయన పిలుపునిచ్చారు.

కాగా, రాహుల్ గాంధీ గతంలో గ్రేట్ నికోబార్‌లో ప్రతిపాదిత అభివృద్ధి ప్రాజెక్టులు పర్యావరణానికి హాని కలిగించవచ్చని వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన అండమాన్ నికోబార్ దీవుల్లో పర్యటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

 

View this post on Instagram

 

A post shared by Rahul Gandhi (@rahulgandhi)

Read Also: ప్రమాదాల్లో అసలైన ‘అగ్ని’పరీక్ష అదే..!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>